అనంతపురంలో టెన్షన్... పోలీస్ స్టేషన్లోనే వైసిపి వర్గీయులపై దాడి

Arun Kumar P   | Asianet News
Published : Jun 25, 2020, 10:33 AM ISTUpdated : Jun 25, 2020, 10:41 AM IST
అనంతపురంలో టెన్షన్... పోలీస్ స్టేషన్లోనే  వైసిపి వర్గీయులపై దాడి

సారాంశం

 అనంతపురం జిల్లాలో అధికార పార్టీకి చెందిన నాయకుల మధ్య ఆదిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. 

 అనంతపురం జిల్లాలో అధికార పార్టీకి చెందిన నాయకుల మధ్య ఆదిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, అదే  వైసిపి నాయకుల బోగతి నారాయణ రెడ్డి వర్గీయులు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడిన ఘటన శింగనమల నియోజకవర్గ పరిధిలోని ఎల్లనూరు మండలకేంద్రంలో చోటుచేసుకుంది.  

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలకేంద్రంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వైకాపా మద్దతుదారుల మధ్య మొదటి నుండి పాత కక్షలు ఉన్నాయి. బుధవారం బోగతి వర్గీయుల పొలం మధ్య నుండి మట్టిని ఎమ్మెల్యే పెద్దారెడ్డి వర్గీయులు తరలిస్తుండగా బోగతి వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ చోటు చేసుకుంది. 

read more   ఏపీలో రైలు ప్రమాదం : మంటల్లో ఐదు ఆయిల్ ట్యాంకర్ భోగీలు.. (వీడియో)

అనంతరం ఇరువర్గాలు పోలీస్ స్టేషన్లో పరస్పర ఫిర్యాదులు చేయడానికి వెళ్లాయి.  అయితే పోలీసులు ఎదురుగానే పెద్దారెడ్డి వర్గం ప్రత్యర్ధి వర్గానికి  చెందినవారిపై దాడికి తెగబడ్డారు. ఏకంగా స్టేషన్లోనే ఈ దాడికి పాల్పడడంతో మళ్లీ ఫ్యాక్షన్ మండలమైన ఎల్లనూరు మండలంలో ముఠా కక్షలు నెలకొనే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.  ఈ కేసును పోలీసులు తీవ్రంగా పరిగణించి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్
Bus Accident : అల్లూరి జిల్లాలో ఘోరం.. బస్సు ప్రమాదంలో 15మంది మృతి