చింతమనేని వీడియో మార్ఫింగ్ కేసులో ఒకరు అరెస్ట్

Published : Feb 21, 2019, 03:57 PM IST
చింతమనేని వీడియో మార్ఫింగ్ కేసులో ఒకరు అరెస్ట్

సారాంశం

టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వీడియో మార్ఫింగ్ కేసులో పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు.

టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వీడియో మార్ఫింగ్ కేసులో పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. తాను మాట్లాడిన వీడియోని మార్ఫింగ్ చేశారంటూ ఎమ్మెల్యే చింతమనేని పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. దీనిపై స్పందించిన పోలీసులు.. కత్తుల రవి అనే యువకుడిని అరెస్టు చేశారు.

 చింతమనేని దళితులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. ఈ ఘటనపై దళిత సంఘాలు నిరసనలు చేపట్టారు. అయితే తన వీడియోను మార్ఫింగ్ చేశారంటూ చింతమనేని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వీడియోను పోస్టు చేసిన కత్తుల రవిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ వీడియోపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోయగా.. టీడీపీ నేతలు మాత్రం.. అదంతా ఫేక్ అంటూ వాధించడం మొదలుపెట్టారు. మంత్రి లోకేష్ కూడా దీనిపై స్పందించారు. 

PREV
click me!

Recommended Stories

TTD: తిరుమ‌ల శ్రీవారి భ‌క్తుల‌కు అల‌ర్ట్‌.. బ్రహ్మోత్సవాల వేళ రూ. 300 టికెట్ల షెడ్యూల్ విడుద‌ల
AP Pensions: ఆంధ్ర‌ప్ర‌దేశ్ పెన్ష‌న్ల‌లో కీల‌క మార్పులు.. ఇక‌పై రెండు విధాలుగా డ‌బ్బులు