పశ్చిమ గోదావరి జిల్లాలో పంట కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు

By Sumanth KanukulaFirst Published Sep 5, 2022, 10:38 AM IST
Highlights

పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. భీమవరం-జువ్వలపాలెం రోడ్డులో అడ్డవవంతెన దగ్గర ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టి పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం కారు నడుపుతున్న వ్యక్తి మరణించగా.. కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన నలుగురికి స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. అయితే అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. 

ఇదిలా ఉంటే.. పల్నాడు జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. నాపరాళ్లతో మాచర్ల నుంచి భీమవరం వెళ్తున్న లారీ పల్నాడు జిల్లాలోని నకరికల్లు మండలం శాంతి నగర్ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. నాపరాళ్లు మీద పడి లారీలో ఉన్న ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. లారీ డ్రైవర్, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. మృతిచెందిన కూలీలను పసర్లపాడుకు చెందిన అమారేసు శ్రీను, దొడ్డ భాస్కరరావు, రమావత్ మునినాయక్‌గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్టీరింగ్‌ రాడ్డు విరగటంతో లారీ అదుపుతప్పి బోల్తా పడినట్టుగా తెలుస్తోంది. 

click me!