రావులపాలెంలో అర్థరాత్రి కాల్పుల కలకలం

Published : Sep 05, 2022, 06:33 AM IST
రావులపాలెంలో అర్థరాత్రి కాల్పుల కలకలం

సారాంశం

ఆంధ్రప్రదేశ్ లోని రావులపాలెంలో ఆదివారం గుర్తు తెలియని దుండగులు ఓ వ్యాపారి, ఆయన కుమారుడిపై కాల్పులకు తెగబడ్డాడు. వారి అరుపులకు చుట్టుపక్కలవారు రావడంతో పారిపోయారు. 

కోనసీమ : రావులపాలెంలో ఆదివారం అర్ధరాత్రి కాల్పుల కలకలం చోటుచేసుకుంది.  ఫైనాన్స్ వ్యాపారి సత్యనారాయణ రెడ్డిపై ఇద్దరు దుండగులు దాడి చేశారు. ఈ క్రమంలో ఆయన కుమారుడు ఆదిత్య రెడ్డి దుండగులను ప్రతిఘటించారు. దీంతో దుండగులు గాల్లోకి కాల్పులు జరిపారు. బాధితులు కేకలు వేయడంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు.  దుండగులు పారిపోతుండగా వారి వద్ద నుంచి ఓ సంచీ పడిపోయింది. దానిని పరిశీలించగా అందులో రెండు నాటుబాంబులు, జామర్ ఉన్నాయి.  సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

YS Jagan: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాలి.. జ‌గ‌న్ డిమాండ్‌
కోటంరెడ్డి వ్యాఖ్యలపై జగన్ ఫస్ట్ రియాక్షన్ | YS Jagan On Kotamreddy Sridhar Reddy | Asianet Telugu