ఎలక్షన్స్ వస్తేనే రక్తం మరుగుతుందా..? చంద్రబాబుపై నాగబాబు సెటైర్

Published : Feb 08, 2019, 02:14 PM IST
ఎలక్షన్స్ వస్తేనే రక్తం మరుగుతుందా..? చంద్రబాబుపై నాగబాబు సెటైర్

సారాంశం

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై మెగా బ్రదర్ నాగబాబు మరోసారి సెటైరికల్ కామెంట్స్ చేశారు.  

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై మెగా బ్రదర్ నాగబాబు మరోసారి సెటైరికల్ కామెంట్స్ చేశారు.  ఇటీవల చంద్రబాబు.. అసెంబ్లీలో బీజేపీ నేతలపై మండిపడుతూ.. ‘రక్తం మరిగిపోతోంది’ అంటూ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఆ వీడియోని తన యూట్యూబ్ ఛానెల్ లో నాగబాబు పోస్టు చేశారు.

అనంతరం ఆ వీడియోపై సెటైర్లు వేశారు. చంద్రబాబు రక్తం మరగడానికి నాలుగేళ్లు పట్టిందంటూ కామెంట్స్ చేశారు. ‘‘చూడండిరా.. పాలు మరిగిపోతున్నాయి.. చూడండి’ అని పాలు మరిగే సన్నివేశాన్ని వీడియోలో చూపించారు.

తరువాత చంద్రబాబు.. ఇటీవల అసెంబ్లీలో బీజేపీ నేతలపై ఫైర్ అవుతున్న వీడియోను చూపించారు. అనంతరం.. ‘చూశారుగా.. పాలు మరగటానికి నాలుగున్నర నిమిషాలు పట్టింది. అదే మరి మన సీఎంగారి రక్తం మరగటానికి నాలుగున్నరేళ్లు పట్టింది. ఎక్కువ మంట పెడితేనే పాలు మరుగుతాయి. ఎలక్షన్లు వస్తేనే మన చంద్రబాబు నాయుడుగారి రక్తం మరుగుతుంది’’ అని వీడియోలో పేర్కొన్నారు.

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం