పశ్చిమ గోదావరి జిల్లాలో ఒమిక్రాన్ టెన్షన్.. ప్రజలను హెచ్చరించిన జిల్లా కలెక్టర్

By Siva Kodati  |  First Published Dec 30, 2021, 4:18 PM IST

దేశంలో టెన్షన్ పెడుతోన్న ఒమిక్రాన్ (omicron) తెలుగు రాష్ట్రాలపైనా ప్రతాపం  చూపుతోంది. తెలంగాణలో కేసులు సెంచరీకి దగ్గరవుతుండగా.. ఏపీలోనూ పెరుగుతున్నాయి. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో ఒమిక్రాన్ వైరస్ టెన్షన్ మొదలైంది. 


దేశంలో టెన్షన్ పెడుతోన్న ఒమిక్రాన్ (omicron) తెలుగు రాష్ట్రాలపైనా ప్రతాపం  చూపుతోంది. తెలంగాణలో కేసులు సెంచరీకి దగ్గరవుతుండగా.. ఏపీలోనూ పెరుగుతున్నాయి. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో ఒమిక్రాన్ వైరస్ టెన్షన్ మొదలైంది. జిల్లాలో ఒమిక్రాన్ కేసులకు సంబంధించిన వివరాలను కలెక్టర్ కార్తికేయ మిశ్రా (kartikeya misra ias) గురువారం వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా వుండాలని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ నెల 21న ఏలూరు (eluru) రూరల్ పత్తి కోళ్ల లంకలో కువైట్ నుండి వచ్చిన 41 సంవత్సరాల మహిళకు ఒమిక్రాన్ పాజిటివ్ అని తేలింది. జిల్లాలో ఇదే తొలి ఒమిక్రాన్ కేసు. 

ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఆమెను హోమ్ ఐసోలేషన్ లో ఉంచామని కలెక్టర్ వెల్లడించారు. గత 45 రోజుల్లో జిల్లాకు 6,856 మంది విదేశాలనుండి వచ్చారని.. వీరికి ఎయిర్ పోర్టులొనే ఆర్టీపీసీ ఆర్ టెస్ట్ లు చేస్తున్నామని కార్తీకేయ మిశ్రా పేర్కొన్నారు. 14 మందికి కోవిడ్ పాజిటీవ్ అని తేలిందన్నారు. 4,200 మందికి 8 రోజుల అనంతరం మరోసారి టెస్టులు చేశామని... ప్రైమరీ కాంటాక్ట్స్ నెగిటివ్ అని తేలాయని కలెక్టర్ తెలిపారు. పాజిటివ్ ఉంటే సీసీఎంబీ ల్యాబ్ హైదరాబాద్‌కు టెస్ట్‌ల నిమిత్తం పంపుతున్నామన్నారు. 

Latest Videos

undefined

Also read:ఒమిక్రాన్ టెన్షన్.. ముంబైలో నేటి నుంచి జ‌న‌వరి 7 వ‌ర‌కు 144 సెక్ష‌న్..

పండగల సీజన్ కావడంతో విదేశాలనుండి ఎక్కువ సంఖ్యలో ప్రజలు వస్తున్నారని  కలెక్టర్ తెలిపారు. 8010968295 నెంబర్ కు బయట నుండి వచ్చిన వారు ఎవరైనా ఉంటే సమాచారం తెలియజేయాలని సూచించారు. 104 కాల్ సెంటర్ ద్వారా సమాచారం సేకరిస్తున్నామని... టెస్టింగ్, క్యారంటైన్…అంశాల్లో తగు జాగ్రత్తలు తీసుకున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలు మాస్క్ ,సోషల్ డిస్టెన్స్ తప్పసరిగా పాటించాలి. పండుగ తరుణంలో పబ్లిక్ ఏరియాలో,షాపింగ్ కాంప్లెక్స్‌ల్లో ఎక్కువ మంది గుంపులుగా ఉండరాదన్నారు. 

18 సంవత్సరాలు నిండిన వారికి ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ జిల్లాలో 100 శాతం పూర్తి చేశామని ఆయన తెలిపారు. 75 శాతం మందికి రెండో డోస్ వ్యాక్సిన్ ఇచ్చామని... 15 నుండి18 సంవత్సరాల వారికి వ్యాక్సిన్ ప్రక్రియ జనవరి 3 నుండి మొదలు పెడతామని కలెక్టర్ పేర్కొన్నారు.  60 సంవత్సరాలు పై బడిన 4 లక్షల 26 వేలమందికి జనవరి 10 నుండి ప్రికాషనరీ డోస్ అందిస్తున్నట్లు కార్తీకేయ మిశ్రా వెల్లడించారు. 
 

click me!