Omicron Tension: శ్రీకాకుళం జిల్లాలో ఒమిక్రాన్ టెన్షన్.. అసలేం జరిగిందంటే..?

By Sumanth Kanukula  |  First Published Dec 8, 2021, 10:06 AM IST

ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా ( Srikakulam district) వాసుల్లో ఒమిక్రాన్ టెన్షన్ (Omicron Tension) మొదలైంది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి, అతని కాంటాక్ట్స్‌లో ఇద్దరికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయింది.


ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా ( Srikakulam district) వాసుల్లో ఒమిక్రాన్ టెన్షన్ (Omicron Tension) మొదలైంది. దక్షిణాఫ్రికా నుంచి కొద్ది రోజుల కిందట శ్రీకాకుళం జిల్లాకు తిరిగి వచ్చిన వ్యక్తికి ఇటీవల వైద్య పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజటివ్‌గా నిర్దారణ అయింది. అయితే దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా ఉండటంతో.. అతనికి కూడా ఒమిక్రాన్ సోకిందమోనన్న అనుమానాలు మొదలయ్యాయి. మరోవైపు దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చిన వ్యక్తి ప్రైమరీ కాంటాక్ట్స్‌ 24 మందికి పరీక్షలు చేయగా.. అందులో ఇద్దరికి Covid పాజిటివ్‌గా నిర్దారణ కావడం మరింత ఆందోళన కలిగిస్తోంది. 

వివరాలు.. దక్షిణాఫ్రికాలోని (South Africa) కేప్‌టౌన్ నుంచి ఓ వ్యక్తి లండన్‌ మీదుగా ముంబై వచ్చి గతనెల 23న శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలోని తన స్వగ్రామానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో పరీక్షలు చేయగా.. కోవిడ్ నెగిటివ్‌ వచ్చింది. దీంతో ఆ వ్యక్తి ఇంటికి చేరుకున్నారు. అయితే ఈ నెల 5వ తేదీన జ్వరం రావడంతో స్థానిక పీహెచ్‌సీలో పరీక్షలు చేయించుకున్నారు. అక్కడ అతని కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయింది. అయితే ఆ వ్యక్తి  విదేశాల నుంచి రావడంతో.. అతని శాంపిల్స్‌ను జినోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపినట్టుగా తెలిపారు. అక్కడ రిపోర్ట్ వచ్చిన తర్వాతే ఒమిక్రాన్ సోకిందా..? లేదా..? తేలనుంది. 

Latest Videos

undefined

అయితే ఈ క్రమంలోనే అధికారులు చర్యలు చేపట్టారు. ఆ వ్యక్తితో పాటుగా కుటుంబ సభ్యులను శ్రీకాకుళం నగరంలో హోం ఐసోలేషన్‌లో ఉంచారు. అతడు నివాసం ఉన్న ప్రాంతాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు. వెంటనే అతని ప్రైమరీ కాంటాక్ట్స్‌ను గుర్తించి పరీక్షలు నిర్వహించగా.. వారిలో ఇద్దరికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. దీంతో వారిద్దరిని కూడా హోం ఐసోలేషన్‌లోనే ఉంచారు. 

దీంతో సంతబొమ్మాళి మండలంలో భయాందోళనలు నెలకొన్నాయి. కొందరు దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్‌ సోకిందనే పుకార్లను సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అయితే ఇలాంటి వదంతులను నమ్మవద్దని వైద్యాధికారులు కోరారు. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తి శాంపిల్స్‌ను జినోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపినట్టుగా తెలిపారు. అంతేకాకుండా ఆ గ్రామంలో దాదాపు 100 మందికి పరీక్షలు చేయాలని వైద్యాధికారులు ఆదేశించినట్టుగా తెలిసింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా ఉన్నతాధికారులు తెలిపారు.  

click me!