ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలను విస్తరించే దిశలో ఆలోచన చేయాలని బ్యాంకర్లకు సూచించిన ఆయన.. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల్లో ఏటీఎంలు (ATMs) ఏర్పాటు చేసేందుకు బ్యాంకులు చర్యలు చేపట్టాలన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలను విస్తరించే దిశలో ఆలోచన చేయాలని బ్యాంకర్లకు సూచించిన ఆయన.. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల్లో ఏటీఎంలు (ATMs) ఏర్పాటు చేసేందుకు బ్యాంకులు చర్యలు చేపట్టాలన్నారు. మంగళవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన 217వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం (state-level bankers meeting) జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు జరుగుతాయని.. ఈ నేపథ్యంలో సచివాలయాలు, ఆర్బీకేల్లో ఏటీఎంలు పెట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
కోవిడ్‌తో కారణంగా ప్రభుత్వ ఆదాయం 2019–20లో రూ.8 వేల కోట్లు, 2020–21లో రూ.14 వేల కోట్లు తగ్గడంతో పాటు కోవిడ్ నివారణ, నియంత్రణ కోసం అదనంగా రూ.8 వేల కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వంపై దాదాపు రూ.30 వేల కోట్ల భారం పడిందని తెలిపారు. బ్యాంకింగ్ రంగం సహకారంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ పరిస్థితిని అధిగమించగలిగిందని అన్నారు. బ్యాంకులు తమ మొత్తం నికర రుణంలో ప్రాధాన్యతా రంగాలకు నిర్దేశించిన దానికి మించి 59.5 శాతం రుణాలు ఇవ్వడంతో పాటు రుణాలు–డిపాజిట్ల నిష్పత్తి 136 శాతం ఉండేలా చొరవ చూపినందుకు అభినందిస్తున్నానని చెప్పారు.
undefined
నిర్దేశిత రుణ మొత్తంలో వ్యవసాయరంగానికి గతేడాది 42.50% రుణాలివ్వగా.. ఈ ఏడాది 38.48% మాత్రమే ఇచ్చారని సీఎం జగన్ బ్యాంకర్లతో అన్నారు. అర్హులైన రైతులకు ఇంకా కిసాన్ క్రెడిట్ కార్డులు అందించాల్సి ఉందని చెప్పారు. ఆర్‌బీకేల స్థాయిలో వీటిని జారీ చేయాలని.. కౌలు రైతులకు రుణాలు అందించాలని సూచించారు. ఈ-క్రాప్ ఆధారంగా ఈ ప్రక్రియ చేపడితే రుణ జాబితాల నుంచి అనర్హులు తొలగిపోతారని అన్నారు. బ్యాంకింగ్ సేవలు ప్రారంభం కావాల్సి ఉన్న 4,240 ఆర్బీకేల్లో కరస్పాండెంట్లను నియమించి.. వీలైనంత త్వరగా ఆ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.
Also Read: జగన్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇక నుంచి వాటిపై నిషేధం
ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల వార్షిక రుణ ప్రణాళిక రూ.2,83,380కోట్లు కాగా, తొలి 6నెలల్లో 60.53శాతం అంటే రూ.1,71,520కోట్లు రుణాలు మంజూరు చేశాయని సీఎం జగన్ చెప్పారు. ప్రాధాన్య రంగానికి వార్షిక రుణ లక్ష్యం రూ. 2,13,560కోట్లుకు గాను 47.29 శాంత అంటే రూ.1,00,990 కోట్లు పంపిణీ చేశాయన్నారు. అయితే వ్యవసాయానికి స్వల్పకాలిక పంట రుణాల్లో తొలి 6నెలల్లో 51.57 శాతం రుణాలు ఇచ్చారని, దీర్ఘకాలిక రుణాల్లో మౌలిక వసతులకు 35.33 శాతం, వ్యవసాయ అనుబంధ రంగాలకు 37.31శాతం మాత్రమే ఇవ్వడం నిరాశాజనకంగా ఉందన్నారు. వీటిపై బ్యాంకులు దృష్టి పెట్టాలని సీఎం జగన్ కోరారు.