‘నా చావుకు ఎవరూ కారణం కాదు..’ లేఖ రాసి సైబర్ ల్యాబ్ ఎస్ఐ ఆత్మహత్య....

By SumaBala BukkaFirst Published Dec 8, 2021, 9:44 AM IST
Highlights

ఈ కేసులపై కోర్టులో విచారణ సాగుతుండడంతో పదోన్నతి ఆగిపోయింది. మరోవైపు రాఘవరెడ్డి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు ప్రేమ వివాహం చేసుకుని హైదరాబాద్ లో ఉంటున్నాడు. అప్పటి నుంచి కుమారులతో పాటు భార్యతో మనస్పర్థలు వచ్చాయి. దీంతో వారు రాఘవరెడ్డి దూరంగా ఉంటున్నారు. దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన ఆయన పురుగుల మందు తాగారు.

కర్నూలు :  నా చావుకు ఎవరూ కారణం కాదు.. court caseలతో.. పదోన్నతి ఆగిపోయి.. తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాను. నా బ్యాచ్ వాళ్లంతా డిఎస్పి హోదాలో ఉన్నారు.  కుటుంబ సభ్యులంతా దూరంగా ఉండటం వల్ల మనస్తాపానికి గురై చనిపోతున్నా’ అంటూ కర్నూలు cyber lab ఎస్ ఐ డి.రాఘవరెడ్డి పురుగుల మందు తాగి మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు.

వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా కదిరి తాలూకా నల్లసింగయ్యగారి పల్లెకు చెందిన రాఘవరెడ్డి 1991లో ఎస్సైగా పోలీస్ శాఖ లో చేరారు. ప్రస్తుతం సైబర్ ల్యాబ్  ఎస్సైగా పని చేస్తున్నారు. కర్నూలు అశోక్ నగర్ లోని ఓ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నారు. కాగా, 2001లో కర్నూలు Railway SIగా పనిచేసేటప్పుడు ఈయనపై రెండు కేసులు నమోదయ్యాయి. 

ఈ కేసులపై కోర్టులో విచారణ సాగుతుండడంతో పదోన్నతి ఆగిపోయింది. మరోవైపు రాఘవరెడ్డి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు love marraiage చేసుకుని హైదరాబాద్ లో ఉంటున్నాడు. అప్పటి నుంచి కుమారులతో పాటు భార్యతో మనస్పర్థలు వచ్చాయి. దీంతో వారు రాఘవరెడ్డి దూరంగా ఉంటున్నారు. దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన ఆయన పురుగుల మందు తాగారు.

ఆ బాధ తట్టుకోలేక ఫ్లాట్ నుంచి బయటకు వచ్చి లిఫ్ట్ లో కిందికి దిగి పక్కనే అపస్మారక స్థితిలో పడిపోయాడు. వాచ్ మెన్ గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. సీఐ పార్థసారధి రెడ్డి, ఏఆర్ డీఎస్పీ ఇలియాజ్ భాషా తదితరులు రాఘవరెడ్డి ఇంటికి చేరుకుని అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను ఆస్పత్రికి తరలించారు. 

Visakhapatnam: తెలుగుతల్లి ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం.. బైక్‌పై వెళ్తున్న యువతి, యువకుడు దుర్మరణం

అయితే అప్పటికే రాఘవరెడ్డి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇంట్లో ఉన్న సూసైడ్ లెటర్ ను పోలీసులు స్వాధీనం చేసుకుని.. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, కామారెడ్డిలో దారుణం జరిగింది... అడ్డా కూలీగా పని చేసుకుని జీవనం సాగించే ఓ Tribal woman హత్యాచారానికి గురైంది. కామారెడ్డి జిల్లా కేంద్రం శివారులో మంగళవారం ఈ ఘటన వెలుగు చూసింది. Kamareddy గ్రామీణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని ఓ తండాకు చెందిన మహిళ (32) కొన్నాళ్లుగా స్వగ్రామంలో ఉపాధి లేకపోవడంతో జిల్లా కేంద్ంరలో అడ్డా కూలీగా పనిచేస్తోంది. 

నవంబర్ 17న ఉదయం ఇంటినుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఆందోళనకు గురైన ఆమె భర్త 18న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటినుంచి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. లింగంపేట మండలం పర్మళ్ల తండాకు చెందిన ప్రకాశ్ తో ఆమెకు పరిచయం ఉన్నట్లు విచారణలో తెలిసింది. అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ విచారణలో తానే హత్య చేసినట్లు ఒప్పుకుని కామారెడ్డి శివారులోని లింగాపూర్ పరిధిలో ఆ మహిళ dead bodyని చూపించాడు.

పనికోసమంటూ ఆ మహిళను ద్విచక్రవాహనం మీద తీసుకుని వచ్చి మద్యం తాగించి rape attempt చేశానని.. ఆ తరువాత గొంతుకు చున్నీ బిగించి murder చేసినట్లు తెలిపాడు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించామని.. కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ వివరించారు.

click me!