అవహేళన చేశాడని.. తమ్ముడిని గునపంతో పొడిచి చంపిన వృద్ధుడు.. ఆ తరువాత 30 గంటలు శవంతోనే....

Published : Mar 07, 2023, 09:29 AM IST
అవహేళన చేశాడని.. తమ్ముడిని గునపంతో పొడిచి చంపిన వృద్ధుడు.. ఆ తరువాత 30 గంటలు శవంతోనే....

సారాంశం

తనను తమ్ముడు అవహేళనగా మాట్లాడాడని ఓ అన్న కోపానికి వచ్చాడు.  సొంత తమ్ముడని కూడా చూడకుండా గునపంతో పొడిచి చంపాడు. ఈ ఘటన ఏపీలో వెలుగు చూసింది. 

పశ్చిమగోదావరి జిల్లా : ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ అన్న సొంత తమ్ముడినే  గునపంతో పొడిచి హత మార్చాడు. తనను పదేపదే అవహేళన చేస్తున్నాడు అన్న కోపంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆ తర్వాత తమ్ముడి శవంతో.. అదే ఇంట్లో 30 గంటల పాటు కదలకుండా అలాగే కూర్చుని పోయాడు. అయితే మృతదేహం నుంచి మర్నాడు ఉదయం దుర్వాసన రావడంతో.. విషయం ఎలాగైనా బయటికి తెలుస్తుంది అనుకున్నాడో ఏమో కానీ.. ఇంట్లో నుంచి బయటికి వచ్చి తన తమ్ముడిని తానే చంపేశానని బిగ్గరగా ఏడవడంతో విషయం వెలుగు చూసింది.

ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా గణపవరంలో జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గణపవరంలోని గొల్లల దిబ్బ ప్రాంతానికి చెందిన వేగ్నేశ నరసింహరాజు (70), వేగ్నేశ రామకృష్ణంరాజు (68)  సొంత అన్నదమ్ములు. వృద్ధులైన వీరిద్దరికి కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. దీంతో ఇద్దరూ కలిసే ఉంటున్నారు. కాగా, ఇందులో అన్న వేగ్నేశ నరసింహారాజు మానసిక స్థితి సరిగా ఉండదు. తరచూ కాళ్లు చేతులు లాగుతున్నాయని ఏడుస్తుండేవాడు.

కర్నూల్ రాతనలో భూకంపం: భయంతో పరుగులు తీసిన జనం

దీంతో విసిగిపోయిన తమ్ముడు రామకృష్ణంరాజు ‘ఎందుకు ఏడుస్తావ్? ఇంట్లో నుంచి వెళ్ళిపో?.. అని అన్న మీద కేకలు వేశాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన అన్న తమ్ముని మీద కక్షపెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆదివారం తెల్లవారుజామున రామకృష్ణంరాజును.. నరసింహారాజు  గుణపంతో పొడిచి, హత్య చేశాడు. ఆ తరువాత ఇంట్లో తమ్ముడి శవంతో అలాగే ఉండిపోయాడు. ఆ తరువాత అతను బైటికి వచ్చి చెబితే కానీ విషయం వెలుగు చూడలేదు. 

ఇదిలా ఉండగా, హైదరాబాదులో ఓ విషాద ఘటన వెలుగు చూసింది. ఓ యువకుడు రాత్రి ఇంట్లో నుంచి వెళ్లి తెల్లారేసరికి శవమై కనిపించాడు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని జవహర్ నగర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడి పేరు సైఫ్ అలీఖాన్ (28). అతని శరీరంపై గాయాలు ఉన్నాయి. అతడిని ఎవరో హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. సైఫ్ కొన్నాళ్ల క్రితం జరిగిన ఓ హత్య కేసులో నిందితుడిగా కూడా ఉన్నాడు. దీనికి తోడు ఇటీవల పెద్దల అంగీకారం లేకుండా మతాంతర వివాహం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే సైఫ్ హత్యకు గురి కావడంతో పలు అనుమానాలు కలుగుతున్నాయి.

కాగా, కౌకూర్ లోని భరత్ నగర్ లో ఆరు నెలల క్రితం ఓ మతిస్థిమితం లేని వ్యక్తి హత్య జరిగింది. సదరు వ్యక్తి గొడవలు దిగుతున్నాడంటూ అక్కడున్న యువకులు అతడి మీద దాడి చేశారు. ఈ దాడి చేసిన వారిలో సైఫ్ కూడా ఉన్నాడు. దీంతో అతని మీద కూడా కేసు పెట్టారు. ఇక సైఫ్.. గురువారం రాత్రి  20 రూపాయలు తండ్రి దగ్గర తీసుకుని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాడు. తిరిగి రాలేదు. తెల్లవారి ఉదయం సైఫ్ గాయాలతో పడి ఉన్నాడని కౌకూర్ భరత్ నగర్ లోని కొంతమంది వ్యక్తులు పేరెంట్స్ కు సమాచారం ఇచ్చారు. దీంతో తండ్రి ఘటన స్థలానికి చేరుకున్నాడు. అప్పటికే సైఫ్ మృతి చెంది ఉన్నాడు.  

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్