కృష్ణా జిల్లాలో దారుణం... మనవరాలి వయసున్న చిన్నారిపై అత్యాచారయత్నం... రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ వృద్దుడు

Arun Kumar P   | Asianet News
Published : Jan 12, 2022, 11:33 AM ISTUpdated : Jan 12, 2022, 11:50 AM IST
కృష్ణా జిల్లాలో దారుణం... మనవరాలి వయసున్న చిన్నారిపై అత్యాచారయత్నం... రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ వృద్దుడు

సారాంశం

మనవరాలి వయసు చిన్నారిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడో వృద్దుడు. ఈ అమానుషం కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. 

విజయవాడ: పసిపాప మొదలు పండుముసలి వరకు ఎవ్వరినీ వదలడం లేదు కామాంధులు. ఆడది అయితే చాలు తమ వాంఛ తీర్చుకోడాని అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు కొందరు మృగాళ్ళు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా రక్షణకు ఎన్ని చట్టాలు, పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించినా అఘాయిత్యాలు మాత్రం ఆగడంలేదు. ఇక అభం శుభం తెలియని చిన్నారులపై కొందరు నీచులు అత్యాచారాలకు పాల్పడుతూ సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా చేస్తున్నారు.  

తాజాగా ఆంధ్ర ప్రదేశ్ (andhra pradesh) రాష్ట్రంలో దారుణం వెలుగుచూసింది. మనవరాలి వయసుండే ఓ చిన్నారిపై వృద్దుడు అత్యాచారయత్నానికి పాల్పడిన దారుణం కృష్ణా జిల్లా (krishna district)లో చోటుచేసుకుంది. ఏడేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి యత్నించి వృద్దుడు రెడ్ హ్యాండెడ్ గా స్థానికులకు పట్టుబడ్డాడు.  

మచిలీపట్నం (machilipatnam) మండలం పల్లెపాలెం గ్రామానికి చెందిన ఏడేళ్ల చిన్నారిపై వీరస్వామి అనే వృద్దుడు కన్నేసాడు. తాత వయసుండే అతడిపై చిన్నారితో పాటు తల్లిదండ్రులకు అనుమానం రాలేదు. ఇదే అలుసుగా వృద్దుడు చిన్నారిపై అఘాయిత్యానికి సిద్దపడ్డాడు. 

చిన్నారికి మాయమాటలు చెప్పిన వృద్దుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అయితే వీరస్వామి వికృత చేష్టలతో భయపడిపోయిన చిన్నారి కేకలు వేసింది. దీంతో స్థానికులు అక్కడికి చేరుకునేసరికి వృద్దుడు చిన్నారితో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ కనిపించాడు. ఇది చూసి కొపోద్రిక్తులైన స్థానికులు వృద్దుడిని పట్టుకుని దేహశుద్ది చేసారు.

చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వ‌ృద్దుడిని అదుపులోకి తీసుకున్నారు. మనవరాలి వయసు చిన్నారిపై మృగంలా వ్యవహరించిన కామాంధుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. 

ఇక ఐదేళ్ల చిన్నారికి మాయమాటలు చెప్పి లోబర్చుకున్న ఓ యువకుడు పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఈ  దారుణం చోటుచేసుకుంది. ఎవరికైనా ఈ విషయం చెబితే చంపేస్తానని బెదిరించడంతో బాలిక భయపడిపోయి బయటపెట్టలేదు. 

అయితే గత రెండు మూడు రోజులుగా బాలిక ప్రవర్తనలో మార్పు వచ్చింది. బాలిక భయంభయంగా, చాలా ఆందోళనగా వుండటాన్ని గమనించిన తల్లిదండ్రులకు అనుమానం వచ్చి ఏమయ్యిందని గట్టిగా అడిగారు. దీంతో కాస్త దైర్యం తెచ్చుకున్న బాలిక తనపై జరిగిన అఘాయిత్యం గురించి తల్లిదండ్రులకు తెలిపింది.

దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకున్ని అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం బాధిత బాలికను పోలీసులు ఏలూరు ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు.

16 నెలల పసికందుపై కన్న తండ్రే అత్యంత పాశవికంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే నవమాసాలూ మోసి జన్మనిచ్చిన కన్నతల్లే దీనికి సహకరించడం. ఆ తరువాత చిన్నారిని దారుణంగా చంపేసి మృతదేహాన్ని మాయం చేయబోయారు. కానీ పట్టుబడ్డారు. ఈ ఘటన సికింద్రాబాద్ లో జరగగా పూణేలో అరెస్ట్ అయ్యారు. 

ముక్కుపచ్చలారని 16 నెలల పసికందుపై కన్నతండ్రే లైంగిక దాడికి పాల్పడ్డాడు. కనికరం లేకుండా గొంతు నులిమి హత్య చేశాడు. ఈ ఘాతుకానికి పసిగుడ్డు తల్లి సహకరించడం అమ్మతనానికే మాయని మచ్చ.. చిన్నారి మృతదేహాన్ని సొంతూరికి తరలించేందుకు రైలెక్కగా  ప్రయాణికుల అనుమానంతో ఈ దారుణం వెలుగుచూసింది. నిందితులు గుజరాత్లోని రాజ్కోట్లో వెళ్తుండగా.. మహారాష్ట్రలోని షోలాపూర్ రైల్వే పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు


 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?