అన్నాచెల్లెళ్లుగా బ్యాంకుకు 9 లక్షల టోకరా .. తీరా ఆరాతీస్తే భార్యాభర్తలుగా తేలడంతో షాక్...

By SumaBala BukkaFirst Published Jan 12, 2022, 10:46 AM IST
Highlights

ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కొప్పరంలో సర్వే నెంబర్లలో 4.73 ఎకరాలు.4.62 ఎకరాలు తమ పూర్వీకుల నుంచి సంక్రమించినట్లుగా సంతమాగులూరు తాసిల్దార్ కార్యాలయంలో ఈ దంపతులు అన్నా చెల్లెళ్లుగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందారు. తరువాత నరసరావుపేట మండలం చైతన్య గోదావరి బ్యాంక్ లో 2020లో ఒక్కొక్కరు 4.50 లక్షల చొప్పున మొత్తం తొమ్మిది లక్షల రుణం పొందారు.

నరసరావుపేట : Aadhaar cardలో అడ్రస్ మార్చి.. బ్యాంకు అధికారులను మోసం చేసి.. తొమ్మిది లక్షల రుణం తీసుకున్న కేసును పోలీసులు చేధించారు. 
Narasaraopet గ్రామీణ స్టేషన్లో మంగళవారం విలేకరుల సమావేశంలో కేసు వివరాలను  ఎస్సై  భక్తవత్సల రెడ్డి వెల్లడించారు.  ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గొబ్బూరుకు చెందిన  దొండపాటి పవన్, ప్రభావతి దంపతులు.

సంతమాగులూరు మండలం కొప్పరంలో భూములు విషయం తెలిసిన పవన్ తన పేరును వెంకటేశ్వర్లుగా మార్చుకున్నాడు. ఆ తర్వాత ప్రభావతి తో కలిసి నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం వచ్చాడు. అక్కడ Couples అయిన తామిద్దరం.. brother and sisterగా పరిచయం చేసుకుని.. అక్కడే ఉంటున్నారు. 

ఈ క్రమంలో ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కొప్పరంలో సర్వే నెంబర్లలో 4.73 ఎకరాలు.4.62 ఎకరాలు తమ పూర్వీకుల నుంచి సంక్రమించినట్లుగా సంతమాగులూరు తాసిల్దార్ కార్యాలయంలో ఈ దంపతులు అన్నా చెల్లెళ్లుగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందారు. ఈ ప్రక్రియలో వీరికి కర్రావుల మునయ్య, గుర్రం చిన్న మల్లికార్జునరావు సాయం చేశారు,  

తరువాత నరసరావుపేట మండలం చైతన్య గోదావరి బ్యాంక్ లో 2020లో ఒక్కొక్కరు 4.50 లక్షల చొప్పున మొత్తం తొమ్మిది లక్షల రుణం పొందారు. అయితే వీరు కిస్తీలు కట్టకపోవడంతో బ్యాంకు వారికి అనుమానం వచ్చింది. వీరి మీద బ్యాంకు సిబ్బంది పూర్తిస్థాయిలో వివరాలు సేకరించి.. మోసానికి గురైన గురైనట్లు తెలుసుకున్నారు. 
ఈ మోసంపై నిరుడు నవంబర్లో బ్యాంకు మేనేజర్ పల్లె పోగుల అంకిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. పవన్, ప్రభావతిలకు మునయ్య, మల్లికార్జునరావుతో పాటు జ్యోతి బాబు, సంతమాగులూరు తహశీల్దార్ కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్ కిషోర్ బాబు సహకరించినట్లు దర్యాప్తులో తేలింది.

 కేసులో నిందితులైన పవన్, ప్రభావతి, మునయ్యలను అరెస్టు చేసి వారి నుంచి తొమ్మిది లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సైలు బాలనాగిరెడ్డి, శ్రీహరి సిబ్బంది ఉన్నారు.

ఇదిలా ఉండగా, శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని పోలీస్ స్టేషన్ ఎదుట చెల్లెలిపై అన్న attack చేసి... knifeతో పొడిచిన ఘటన సోమవారం రాత్రి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు పోలీస్ స్టేషన్ వద్ద జరిగింది. బాధితురాలి కథనం మేరకు సంగం మండలం జెండాదిబ్బ ప్రాంతానికి చెందిన శిరీష, కోవూరు మండలం కట్టకింద చెర్లోపాలెంకు చెందిన అశోక్ లు గత కొంత కాలంగా ప్రేమించుకున్నారు. 

అశోక్ క్యాటరింగ్ పనులు చేస్తుంటాడు. ఇద్దరు మేనేజర్లు కావడంతో మూడు రోజుల క్రితం వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత ఇంటికి వచ్చిన వారి పెళ్లికి ఇరు familys అభ్యంతరం చెప్పాయి.దీంతో ఈ విషయం కొవ్వూరు police stationకు చేరింది.  ఎస్సై దాసరి వెంకటేశ్వరరావు సోమవారం ఇరు కుటుంబాలను పోలీస్ స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో రాత్రి కావడంతో అప్పటికి వారిని వెళ్ళిపోయి.. మంగళవారం ఉదయం రావాలని చెప్పారు. ఆ సమయంలో స్టేషన్ బయట ఇరు కుటుంబాల వారు మాట్లాడుకుంటున్నారు.

శిరీష వారి కుటుంబ సభ్యులతో వెళ్లేందుకు అంగీకరించలేదు.  దీంతో శిరీష అన్న హరీష్ ఒక్కసారి చెల్లెలిపై కత్తితో దాడి చేశాడు.

click me!