ఆ విషయమై మరోసారి సుప్రీంకి, సీఐడీ విచారణకు హాజరౌతా: రఘురామకృష్ణంరాజు

Published : Jan 12, 2022, 11:27 AM ISTUpdated : Jan 12, 2022, 05:21 PM IST
ఆ విషయమై మరోసారి సుప్రీంకి, సీఐడీ విచారణకు హాజరౌతా: రఘురామకృష్ణంరాజు

సారాంశం

తాను సంక్రాంతికి నర్సాపురం వస్తున్నానని తెలిసే సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు చెప్పారు. ఏపీ సీఐడీ అధికారులు రఘురామకృష్ణంరాజుకి నోటీసులు  అందించారు.ఈ నోటీసులు అందుకొన్న తర్వాత ఆయన  మీడియాతో మాట్లాడారు.

హైదరాబాద్: ఈ నెల 17న తనను విచారణకు హాజరు కావాలని సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారని  వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు చెప్పారు.ఇవాళ ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు తీసుకొన్న తర్వాత Raghu Rama krishnam Raju బుధవారం నాడు Hyderabad గచ్చిబౌలిలోని తన నివాసంలో  ఆయన  మీడియాతో మాట్లాడారు.

రెండున్నర ఏళ్ల తర్వాత తాను తన స్వంత నియోజకవర్గానికి వెళ్లే సమయంలో విచారణకు రావాలని Cid అధికారులు కోరుతున్నారన్నారు. ఇవాళ నోటీసులు ఇచ్చి రేపే విచారణకు రావాలంటే ఎలా అని తాను సీఐడీ అధికారులను ప్రశ్నించానన్నారు. దీంతో ఈ నెల 17న విచారణకు రావాలని సీఐడీ అధికారులు తనకు చెప్పారన్నారు. గతంలో తనపై నమోదైన కేసుల్లో మరిన్ని వివరాలు రాబట్టేందుకు విచారణకు రావాలని సీఐడీ అధికారులు కోరారని రఘురామకృష్ణంరాజు చెప్పారు.

తనకు చట్టం, న్యాయం, రాజ్యాంగం అంటే గౌరవం ఉందన్నారు. ఇన్నాళ్లూ అడగకుండా పండుగ రోజుల్లోనే తనను విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్ కి, ఏపీ సీఎం Ys Jagan కు సంక్రాంతి పండగ ప్రాశ్యస్త్రం ఏం తెలుసునని ఆయన ప్రశ్నించారు.

గతంలో తనను  అరెస్ట్ చేసిన సమయంలో  సీఐడీ పోలీసులు చిత్రహింసలు పెట్టారని రఘురామకృష్ణంరాజు చెప్పారు. ఈ సమయంలో కార్యాలయంలో ఉన్న cctvలు ఎందుకు లేవని ఆయన ప్రశ్నించారు. తనపై దాడి చేసే సమయంలో తన సెక్యూరిటీని ఎందుకు అనుమతించలేదో చెప్పాలన్నారు. ఈ విషయమై తాను Supreme courtలో మరోసారి విచారణ చేయాలని కోరుతానని చెప్పారు.

తాను Narsapuram వెళ్ళే సమయంలో  అవసరమైన బందోబస్తును ఏర్పాటు చేయాలని తాను జిల్లా పోలీసులకు లేఖ రాసినట్టుగా చెప్పారు. corona ప్రోటోకాల్స్ కు అనుగుణంగా తాను విచారణకు హాజరౌతానని ఆయన తెలిపారు. 

2021 మే మాసంలో నమోదైన కేసుల్లో విచారణకు హాజరు కావాలని గతంలో కూడా పలుమార్లు నోటీసులు పంపినా కూడా రఘురామకృష్ణంరాజు హాజరు కాలేదని సీఐడీ అధికారులు చెబుతున్నారు.ఈ విషయమై మరోసారి ఈ నెల 17న విచారణకు రావాలని సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 13నే విచారణకు రావాలని తోలుత రఘురామకృష్ణంరాజును కోరారు. అయితే సంక్రాంతి పర్వదినం ఉన్నందున తాను విచారణకు రాలేనని కూడా ఎంపీ రఘురామకృష్ణంరాజు చెప్పారు. దీంతో ఈ నెల 17న విచారణకు రావాలని ఎంపీ ని సీఐడీ కోరింది. ఇందుకు రఘురామకృష్ణంరాజు సమ్మతించారు.

గత ఏడాది మే మాసంలో సీఐడీ అధికారులు రఘురామకృష్ణంరాజుపై కేసులు నమోదు చేశారు.ఈ కేసులో సుప్రీంకోర్టు అదే నెల 21న షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ సమయంలో విచారణకు సహకరించాలని కూడా సుప్రీంకోర్టు రఘురామకృష్ణంరాజును కోరింది. ఇదే విషయాన్ని ఆసరాగా తీసుకొన్న సీఐడీ అధికారులు ఆయనను విచారణకు హాజరు కావాలని కోరినా రఘురామకృష్ణంరాజు హాజరు కాలేదని అధికారులు చెబుతున్నారు. ఈ కేసు విషయమై మరింత సమాచారం కోసం విచారణకు రావాలని ఎంపీకి నోటీసులు ఇచ్చామని సీఐడీ అధికారులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?