లాడ్జిలో వృద్ధ దంపతుల ఆత్మహత్య

Published : Apr 12, 2021, 07:57 AM ISTUpdated : Apr 12, 2021, 08:14 AM IST
లాడ్జిలో వృద్ధ దంపతుల ఆత్మహత్య

సారాంశం

వీరితోపాటు ఉంటున్న ఈ వృద్ధ దంపతులు స్విమ్స్ ఆస్పత్రిలో వైద్యం కోసం ఈ నెల 7న తిరుపతి వచ్చారు. రైల్వే స్టేషన్ సమీపంలోని మానస లాడ్జిలో దంపతులు గది తీసుకున్నారు.

తిరుపతి రైల్వేస్టేషన్ కు సమీపంలోని ఓ లాడ్జిలో ఇద్దరు వృద్ధ దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా ఐరాల మండలం వేదాంతవారిపల్లికి చెందిన తుమాటి చిన్నపనాయుడు(73), రుక్మిణి(60) దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉండగా.. కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లై ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నారు.

వీరితోపాటు ఉంటున్న ఈ వృద్ధ దంపతులు స్విమ్స్ ఆస్పత్రిలో వైద్యం కోసం ఈ నెల 7న తిరుపతి వచ్చారు. రైల్వే స్టేషన్ సమీపంలోని మానస లాడ్జిలో దంపతులు గది తీసుకున్నారు. ఉన్నట్లుండి శనివారం వారు విషం కలిపిన ఆహారం తీసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు.

ఈ మేరకు తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను ఎస్వీ మెడికల్ కళాశాలలకు తరలించారు. కుమార్తెలు హిమ బిందు, శేష బిందు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వీరి ఆత్మహత్యకు గల అసలు కారణం తెలియలేదు. కూతుళ్లకు భారం కాకూడదని ప్రాణాలు తీసుకున్నారనే అనుమానం కలుగుతోంది. 

PREV
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!