ఏబీ వెంకటేశ్వరరావుపై అభియోగాలు: ఈ నెల 18 విచారణ, మాజీ డీజీపీలకు మెమోలు

Published : Mar 15, 2021, 04:53 PM ISTUpdated : Mar 18, 2021, 01:58 PM IST
ఏబీ వెంకటేశ్వరరావుపై అభియోగాలు: ఈ నెల 18 విచారణ, మాజీ డీజీపీలకు మెమోలు

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై ఈ నెల 18న శాఖపరమైన విచారణ  నిర్వహించనున్నారు.

అమరావతి:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై ఈ నెల 18న శాఖపరమైన విచారణ  నిర్వహించనున్నారు.

ఈ మేరకు కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ సమాచారం పంపింది. చంద్రబాబునాయుడు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏబీ వెంకటేశ్వరరావు ఇంటలిజెన్స్ చీఫ్ గా పని చేశారు. ఈ సమయంలో ఇజ్రాయిల్ నుండి పరికరాల కొనుగోలు విషయంలో అవకతవకలకు పాల్పడినట్టుగా ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. 

ఇదే విషయమై ఆయనను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తన సస్పెన్షన్ పై ఏబీ వెంకటేశ్వరరావు  కోర్టులను ఆశ్రయించారు. వెంకటేశ్వరరావుపై నమోదైన అభియోగాలపై  శాఖపరమైన విచారణను ఈ నెల 18న నిర్వహించనున్నారు. ఈ విషయమై మాజీ డీజీపీలను విచారణకు రావాలని కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ మెమోలు పంపింది.

చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో డీజీపీలుగా పనిచేసిన  జేవీ రాముడు, సాంబశివుడు, మాలకొండయ్య, ఆర్పీ ఠాకూరులను రావాలని మెమోలు జారీ చేసింది. ఏపీ సచివాలయంలో విచారణ జరగనుంది.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!