మంత్రులు, నేతలతో జగన్ భేటీ: చైర్మెన్, మేయర్ అభ్యర్ధుల ఎంపికపై చర్చ

By narsimha lodeFirst Published Mar 15, 2021, 3:05 PM IST
Highlights

మున్సిపల్, కార్పోరేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. మున్సిపల్ ఛైర్మెన్లు, కార్పోరేషన్ల మేయర్ ఎంపికపై వైసీపీ నాయకత్వం కేంద్రీకరించింది.

అమరావతి: మున్సిపల్, కార్పోరేషన్ ఎన్నికల్లో  వైసీపీ ఘన విజయం సాధించింది. మున్సిపల్ ఛైర్మెన్లు, కార్పోరేషన్ల మేయర్ ఎంపికపై వైసీపీ నాయకత్వం కేంద్రీకరించింది.

ఆయా జిల్లాల్లో మున్సిపల్ చైర్మెన్లు, కార్పోరేషన్ల మేయర్ల ఎంపికపై మంత్రులు, నేతలతో సీఎం జగన్ సమావేశం అయ్యారు.సోమవారం నాడు పార్టీ నేతలు, మంత్రులు క్యాంప్ కార్యాలయానికి చేరుకొన్నారు.ఇవాళ సాయంత్రం అభ్యర్ధుల జాబితాను వైసీపీ ప్రకటించే అవకాశం ఉంది.

. పార్టీ కోసం పనిచేసినవారితో పాటు సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకొని అభ్యర్ధులను ఎంపిక చేసే అవకాశం ఉంది.మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. వైసీపీ ప్రభంజనంలో విపక్షాలు కొట్టుకుపోయాయి. చాలా మున్సిపాలిటీల్లో విపక్షాలు సింగిల్ డిజిట్లకే పరిమితమయ్యాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా  దెబ్బతింది. టీడీపీకి కంచుకోటలాంటి ప్రాంతాల్లో ఆ పార్టీ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. 

బీజేపీ, జనసేన కూటమి కూడ ఈ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయింది. కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది. ఈ ఎన్నికల్లో వైసీపీ ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది.


 

click me!