విశాఖ పరిపాలనా రాజధాని : మంత్రులు, అధికారుల క్యాంప్ కార్యాలయాలు గుర్తింపు .. సీఎస్ ఆదేశాలు

By Siva Kodati  |  First Published Nov 23, 2023, 6:53 PM IST

పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా విశాఖపట్నం నుంచి పాలన సాగిస్తానని ఏపీ సీఎం వైఎస్ జగన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆయన ఆదేశాల మేరకు పరిపాలనా రాజధానిగా విశాఖను మార్చేందుకు వేగంగా పనులు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా గురువారం కీలక పరిణామం చోటు చేసుకుంది. విశాఖలో అధికారుల క్యాంప్ కార్యాలయాలను గుర్తించారు.


పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా విశాఖపట్నం నుంచి పాలన సాగిస్తానని ఏపీ సీఎం వైఎస్ జగన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆయన ఆదేశాల మేరకు పరిపాలనా రాజధానిగా విశాఖను మార్చేందుకు వేగంగా పనులు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా గురువారం కీలక పరిణామం చోటు చేసుకుంది. విశాఖలో అధికారుల క్యాంప్ కార్యాలయాలను గుర్తించారు. నగరంలో 35 ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు భవనాలు కేటాయిస్తూ ఏపీ సర్కార్ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది . విశాఖ రిషికొండపై వున్న మిలీనియం టవర్స్‌లో మంత్రులు , అధికారుల క్యాంప్ కార్యాలయాలను ప్రభుత్వం నియమించిన హై లెవల్ కమిటీ గుర్తించింది. 

మిలీనియం టవర్స్‌లోని ఏ, బీ టవర్స్‌ను ఇందుకోసం కేటాయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. శాఖల సొంత భవనాలు, స్థలాలను తొలి ప్రాధాన్యంగా వినియోగించాలని.. అలాంటి వెసులుబాటు లేని శాఖలు, అధికారుల కార్యాలయాలకు మిలీనియం టవర్స్‌ను కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ముఖ్యమంత్రి, మంత్రులు ఉత్తరాంధ్రలో సమీక్షలకు వెళ్లిన సమయంలో మిలీనియం టవర్స్‌లోని ఏ, బీ టవర్స్‌లను కేటాయిస్తున్నట్లు సీఎస్ పేర్కొన్నారు. మొత్తం 2 లక్షల 27 వేల చదరపు అడుగుల ప్రభుత్వ భవనాల స్థలాలను ప్రభుత్వం గుర్తించింది. 

Latest Videos

click me!