ప.గో జిల్లా: వ్యవసాయ తోటలో అశ్లీల నృత్యాలు... రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ యువతీ యువకులు

Arun Kumar P   | stockphoto
Published : Jan 20, 2022, 11:21 AM ISTUpdated : Jan 20, 2022, 11:38 AM IST
ప.గో జిల్లా: వ్యవసాయ తోటలో అశ్లీల నృత్యాలు... రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ యువతీ యువకులు

సారాంశం

పశ్చిమ గోదావరి జిల్లాలో కొందరు యువతీ యువకులు వ్యవసాయ తోటలో మందుపార్టీ చేసుకుని అర్దనగ్నంగా అశ్లీల నృత్యాలు చేస్తూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. 

పశ్చిమ గోదావరి: ఓ తోటలో కొందరు యువతీయువకులు అశ్లీల కార్యకలాపాలకు పాల్పడుతూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. అశ్లీల నృత్యాల (Obscene dance)తో నానా హంగామా సృష్టిస్తుండగా గుర్తించిన స్థానికులు పోలీసులు సమాచారమివ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన పశ్చిమ గోదావరి (west godavari) జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే...  ప.గో జిల్లా పోలసానిపల్లెలోని ఓ తోటలో బుధవారం అర్థరాత్రి భారీ సౌండ్ సిస్టమ్ పెట్టి కొందరు యువతీ యువకులు పార్టీ చేసుకున్నారు. అయితే ఇది సాధారణ మందుపార్టీగానే గ్రామస్తులు భావించారు. అయితే అర్ధరాత్రి అవుతున్నా పార్టీ ముగియకపోవడం... పాటలు హోరెత్తడంతో పొలసానిపల్లె ప్రజలకు అనుమానం వచ్చింది. దీంతో పోలీసులకు సమాచారమివ్వగా అసాంఘిక కార్యకలాపాలతో సాగుతున్న పార్టీ గుట్టు రట్టయ్యింది.  

రాజమండ్రితో పాటు పంగిడిగూడెం, సూర్యచంద్రరావుపేట, నల్లజర్ల కు చెందిన ఏడుగురు యువకులు పొలసానిపల్లిలో పార్టీ చేసుకున్నారు. ముగ్గురు యువతులు కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు. యువతీ యువకులంతా మందు తాగుతూ అరుపులు, కేకలతో అశ్లీల నృత్యాలు చేసారు. 

అయితే గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో పార్టీ జరుగుతున్న తోట  వద్దకు వెళ్లిన పోలీసులకు అశ్లీలంగా వున్న యువతీ యువకులు కనిపించారు. అర్థనగ్నంగా ఐటెం సాంగ్స్ కు  స్టెప్పులేస్తూ హంగామా చేస్తూ యువతీ యువకులు పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.  

పూర్తిగా మద్యం మత్తులో మునిగిపోయిన యువతీ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ కారు, ఆరు సెల్ ఫోన్లు, ఐదు బైక్స్, సౌండ్ సిస్టంను కూడా స్వాదీనం చేసుకున్నారు. ఇలా పోలాల్లో పార్టీ ఏర్పాటుచేసిన నిర్వహకుడి ఆఛూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

గతేడాది ఇదే పశ్చిమ గోదావరి జిల్లాలో ఇలాగే ఓ రాజకీయ నాయకుడు పెళ్లిరోజు పార్టీలో యువతులతో అశ్లీల నృత్యాలు ఏర్పాటుచేసారు. పాలకొడేరు మండలం పెన్నడపాలెంలో ఈ అశ్లీల నృత్యాల పార్టీ జరిగింది. అయితే ఈ అశ్లీల నృత్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు మాజీ సర్పంచ్ పై కేసు నమోదు చేశారు. ఇలా ఆనందాన్ని ఇవ్వాల్సిన పెళ్లిరోజు వేడుక అతడిని ఇబ్బందులపాలు చేసింది.

తన పెళ్లి రోజున పెన్నడపాలెం గ్రామ మాజీ సర్పంచ్ చేబ్రోలు రామకృష్ణ ఇతర ప్రాంతాల నుండి యువతులను రప్పించి అశ్లీల నృత్యాలతో కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఈ క్రమంలో యువతులతో కలిసి సదరు మాజీ సర్పంచ్ చిందులేశారు. ఈ పార్టీ గతంలో తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. తాజాగా ఇదే ప.గో జిల్లాలో అశ్లీల నృత్యాలతో జరిగిన మందు పార్టీ  కలకలం రేపింది.    

 

 

PREV
click me!

Recommended Stories

YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu
Deputy CM Pawan Kalyan Speech: ఆరడుగుల బుల్లెట్ నేను కాదురఘురామ పై పవన్ పంచ్ లు | Asianet Telugu