Andhra Pradesh: గృహహింస కేసులో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆంధ్రప్రదేశ్ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోడలికి కోటి రూపాయల పరిహారం చెల్లించాల ని కోర్టు ఆదేశించింది. విజయవాడలోని ఒకటో చీఫ్ మెట్రోపాలిటన్ న్యాయమూర్తి టి.వెంకట శివసూర్య ప్రకాశ్ బుధవారం ఈ తీర్పును వెలువరించారు.
Andhra Pradesh: గృహహింస కేసులో భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party-బీజేపీ) ఆంధ్రప్రదేశ్ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ (kanna lakshminarayana) కోడలికి కోటి రూపాయల పరిహారం చెల్లించాల ని కోర్టు ఆదేశించింది. విజయవాడ (vijayawada)లోని ఒకటో చీఫ్ మెట్రోపాలిటన్ న్యాయమూర్తి టి.వెంకట శివసూర్య ప్రకాశ్ బుధవారం ఈ తీర్పును వెలువరించారు. అలాగే, నెలకు యాభై వేల రూపాయలను భరణంగా చెల్లించాలని ఆదేశించారు. కోర్టు ఖర్చుల కింద వేయి రూపాయలు ఇవ్వాలంటూ న్యాయస్థానం తీర్పును ఇచ్చింది.
వివరాల్లోకెళ్తే.. భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ (kanna lakshminarayana) కుమారుడు, గుంటూరు మాజీ మేయరు కన్నా నాగరాజు (kanna nagaraju) తన మేనమామ కుమార్తె శ్రీలక్ష్మి కీర్తిని 2006లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే, ఈ పెండ్లి నాగరాజు తల్లి విజయలక్ష్మికి ఇష్టం లేదు. మొదట్లో ఈ పెండ్లికి ఆమె నిరాకరించారు. కానీ పెండ్లి జరిగన తర్వాత కూడా కుటుంబంలో వివాదాలు మొదలయ్యాయి. రోజురోజుకూ ఈ వివాదాలు పెరుగుతూ పోయాయి.
undefined
ఈ క్రమంలోనే 2013లో శ్రీలక్ష్మి కీర్తి.. ఓ పాపకు జన్మనిచ్చింది. బిడ్డపుట్టిన రెండేండ్లు సజావుగానే సాగిన కన్నా నాగరాజు-శ్రీలక్ష్మికీర్తి వివాహ బంధంతో మళ్లీ గొడవలు ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలోనే 2015 మార్చిలో తల్లీబిడ్డను ఇంటినుంచి బయటకు పంపేశారు. దీనిపై శ్రీలక్ష్మి కీర్తి విజయవాడ ఒకటో చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో గృహహింస (Domestic violence) పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని విచారించిన vijayawada న్యాయస్థానం తీర్పును వెల్లడించింది.
శ్రీలక్ష్మి కీర్తికి రూ.కోటి పరిహారంతో పాటు నెలకు రూ.50వేలు భరణంగా చెల్లించాలని, కోర్టు ఖర్చుల కింద రూ.1,000 ఇవ్వాలని తీర్పు చెప్పింది. అలాగే, పాపకు అనారోగ్యంగా ఉండడంతో వైద్యానికి శ్రీలక్ష్మి ఖర్చు చేసిన రూ.50వేలు కూడా తిరిగి చెల్లించాలని కూడా పేర్కొంది. ఈ మొత్తానికి 12శాతం వడ్డీ చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీలక్ష్మితో పాటు కుమార్తెకు ఇంట్లో భాగస్వామ్యం కల్పించాలని కూడా న్యాయస్థానం స్పష్టం చేసింది. తీర్పు ఉత్తర్వులు వెలువడిన మూడు నెలల్లోపు ఇవన్నీ అమలు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. లేకపోతే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు.