ఆ విషయంలో ఎన్టీఆర్ గారే నాకు స్ఫూర్తి: నారా లోకేష్

By Arun Kumar PFirst Published May 28, 2021, 10:16 AM IST
Highlights

టిడిపి వ్యవస్థాపకులు ఎన్టీఆర్ 98వ జయంతి సందర్భంగా ఆయన మనవడు, మాజీ మంత్రి నారా లోకేష్ నివాళి అర్పించారు. 

అమరావతి: దివంగత ముఖ్యమంత్రి, టిడిపి వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 98వ జయంతి సందర్భంగా ఆయన మనవడు, మాజీ మంత్రి నారా లోకేష్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా తన తాతను స్మరించుకుంటూ సోషల్ మీడియా వేదికన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  

''ఎన్టీఆర్ గారి జీవితం అప్పుడప్పుడూ స్మరించుకునే చరిత్ర కాదు. ప్రతిరోజూ చదవాల్సిన స్ఫూర్తి పాఠం. ఒక సామాన్యుడి స్థాయి నుంచి అసామాన్యుడిగా, అసాద్యుడిగా,చారిత్రాత్మక నాయకుడిగా ఎదిగేందుకు  కృషి, క్రమశిక్షణ, పట్టుదల, నిజాయితీలను తన వ్యక్తిత్వంలోనూ, జీవితంలోనూ భాగం చేసుకున్నారు ఎన్టీఆర్'' అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.

''సాటి మనిషిని నిస్వార్థంగా ఆదుకోవడంలో ఎన్టీఆర్ గారే నాకు స్ఫూర్తి. బడుగు వర్గాలకు అన్నివిధాలా అండగా నిలిచి, వారి ఎదుగుదలకు ప్రాణం పోసిన మహానాయకుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ మానవతావాది ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకుని సమసమాజ స్థాపనకు కృషిచేద్దాం'' అని టిడిపి శ్రేణులకు పిలుపునిచ్చారు లోకేష్.  

read more  భావితరాలకు ఎన్టీఆర్ స్పూర్తి: చంద్రబాబు నివాళులు

ఇక నట సార్వభౌముడు, తండ్రి ఎన్టీఆర్‌ 98వ జయంతి సందర్భంగా తనయుడు, హీరో నందమూరి బాలకృష్ణ అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. తన సొంత గాత్రంతో `శ్రీరామదండకం` శ్లోకాన్ని ఆలపించారు. ఈ వీడియోని తాజాగా శుక్రవారం విడుదల చేశారు. చాలా కఠినమై, సంక్షిష్టమైన పదాలను కూడా బాలయ్య అవలీలగా ఆలపించి మెస్మరైజ్‌ చేశారు. విడుదలైన ఈ పాట ఇప్పుడు అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది. 

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, `వెండి తెరమీదున్న కథానాయికుడిని ఆబాల గోపాలానికి ఆరాధ్యున్ని చేసిన ఆది అధినాయకుడు...` అంటూ ఎన్టీఆర్‌ గొప్పతనాన్ని కీర్తించారు బాలకృష్ణ. ఎన్టీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా తాను పాడిన `శ్రీరామదండకం` పాటని ఆ తారక రాముడికి అంకితమని తెలిపారు. 

 

click me!