
కడపలో ఓ ఎస్సై వీరంగం సృష్టించాడు. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించాడని ఓ యువకుడిని చితకబాదాడు. దీంతో ఈ ఘటన ఎస్సై మీద పలు విమర్శలకు దారి తీసింది. ఈ సంఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ నెల 25న కర్ఫ్యూ ఆంక్షలు కొనసాగుతున్న సమయంలో ఓ యువకుడు టూవీలర్ మీద వెల్తుండగా ఎదురుగా కడప టూటౌన్ ఠాణా ఎస్సై జీవన్ రెడ్డి కనిపించారు. యువకుడు భయపడి టూవీలర్ ను వెనక్కి తిప్పి కొద్ది దూరం వెళ్లాడు. అక్కడ బండి అదుపు తప్పి కింద పడిపోయాడు.
వెంటనే ఎస్సై అక్కడికి వచ్చి అతన్ని చితక బాదాడు. యువకుడు ఎస్సై కాళ్లు పట్టుకుని వలిదిపెట్టమమని అడిగినప్పటికీ కనికరించలేదు. దీంతో యువకుడి ఒళ్లంతా గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఎస్సీ అన్బురాజన్ ఘటన మీద విచారించి ఎస్సైని వీఆర్ కు బదిలీ చేశారు.