మూడు రోజుల్లో లక్ష పెళ్ళిళ్ళు

First Published Nov 12, 2017, 12:33 PM IST
Highlights
  • ఈనెల చివరి వారంలో రాష్ట్రంలో బహుశా ఎక్కడ విన్నా మంగళవాయిధ్యాలే వినబడతాయేమో !

ఈనెల చివరి వారంలో రాష్ట్రంలో బహుశా ఎక్కడ విన్నా మంగళవాయిధ్యాలే వినబడతాయేమో ! ఎందుకంటే, ఈనెల 23, 24, 25 తేదీల్లో రాష్ట్రం మొత్తం మీద లక్ష పెళ్ళిల్లు జరగబోతున్నాయి. ఒకరోజులో ఇంత భారీ స్ధాయిలో పెళ్ళిల్లు జరగటం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి. ఈనెల 28వ తేదీ నుండి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నెల 19వ తేదీ వరకూ శుక్రమౌఢ్యమి కారణంగా పెళ్ళిల్లు జరగవు. అదే సందర్భంలో యాధృచ్చికంగా ఈనెల 23-25 తేదీల్లో  మంచి ముహూర్తాలు కూడా కుదరటంతో పెళ్ళిల్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి.

గడచిన 10 మాసాల్లో సరైన ముహూర్తాలు లేక, మూఢాల వల్ల వివాహాలు పెద్దగా జరగలేదు. అందులోనూ ఈనెలలో పై రోజుల్లో తప్పించి మంచి ముహూర్తాలు లేక పోవటంతో ఎక్కువమంది పై తేదీలనే ప్రిఫర్ చేసారు. దాంతో రాష్ట్రం మొత్తం పెళ్ళి కళ ఉట్టిపడుతోంది. పై మూడు రోజుల్లో జిల్లాకు సగటున 10 వేల వివాహాలు జరుగుతాయి. రాజధాని జిల్లాలైన కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే ఏకంగా 30 వేల పెళ్ళిల్లు జరుగుతున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా చిన్నా, పెద్ద కలిపి సుమారు 80 వేల మండపాలున్నాయి. మిగిలిన పెళ్ళిళ్ళకు మండపాలు దొరక్క చివరకు మఠాలు, దేవాలయాల్లో కూడా వివాహాలు జరిపేందుకు సిద్ధపడుతున్నారు ఇరువైపుల పెద్దలు. మండపాల పరిస్ధితి ఇలాగుంటే, మండపాల అలంకరణ బృందాలు, డెకరేషన్, బ్యాండు బృందాలు, పూల అలంకరణ, క్యేటరింగ్, ఫొటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లకు డిమాండే డిమాండ్. డిమాండ్ కారణంగా ప్రతీ మండంపైనా జిఎస్టీ పేరుతో ఇప్పటికే ఉన్న అద్దెలపై 20 శాతం అద్దెలు పెంచేసారు.

ఒకపుడు 24 గంటలు అద్దె వసూలు చేసేవారు డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని 12 గంటలకు కుదించారు. తర్వాత 8 గంటలని, తాజాగా 6 గంటలకు కుదించేసారు. ఫొటో ఆల్బమ్, వీడియో ఆల్బమ్ కు దాదాపు లక్ష రూపాయల వరకూ వసూలు చేస్తున్నవారు. ఇక, క్యేటరింగ్ అద్దెలు కూడా భారీగా పెరిగిపోయాయి.

 

 

 

 

click me!