అవసరమైతే హీరో రామ్ కి కూడ నోటీసులు: విజయవాడ పోలీసులు

By narsimha lodeFirst Published Aug 16, 2020, 2:17 PM IST
Highlights

స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదంపై విజయవాడ పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఆస్టర్ డి ఎమ్ హెల్త్ కేర్ మేనేజ్ మెంట్ పాత్రపై కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు.

విజయవాడ:స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదంపై విజయవాడ పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఆస్టర్ డి ఎమ్ హెల్త్ కేర్ మేనేజ్ మెంట్ పాత్రపై కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఈ నెల 9వ తేదీన స్వర్ణ ప్యాలెస్ హోటల్ లోని కోవిడ్ సెంటర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది.ఈ ప్రమాదంలో 10 మంది మరణించారు. ఈ ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకొని విచారణ చేస్తున్నారు.

ఈ కేసు విచారణలో ఆటంకం కలిగిస్తే ఎలాంటివారికైనా నోటీసులు ఇవ్వడానికి వెనుకాడబోమని విజయవాడ ఏసీపీ సూర్యచంద్రరావు చెప్పారు. ఓ తెలుగు న్యూస్ ఛానెల్ తో ఏసీపీ ఆదివారం నాడు మాట్లాడారు.

తమ కేసు విచారణకు ఆటంకం కల్గిస్తే హీరో రామ్ కి కూడ నోటీసులు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు.  డాక్టర్ రమేష్ అల్లుడు ఇవాళ విచారణకు రావాల్సి ఉంది. కానీ, ఆయన విచారణకు హాజరుకాలేదు.

రెండు వారాల పాటు క్వారంటైన్ లో ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయని కళ్యాణ్ చక్రవర్తి తమకు మెయిల్ పంపినట్టుగా ఏసీపీ చెప్పారు. వృద్ధాప్యంలో ఉన్నవారు విచారణకు రాకపోతే ఇంటికి వెళ్లి విచారిస్తామని ఆయన స్పష్టం చేశారు.

also read:స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం: రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

నిజంగానే అనారోగ్య పరిస్థితులతో విచారణకు హాజరుకావడం లేదా ఉద్దేశ్యపూర్వకంగా చాలామంది విచారణకు దూరంగా ఉంటున్నారా అనే విషయాన్ని కూడ పరిశీలించనున్నట్టుగాా పోలీసులు స్పష్టం చేశారు.

డాక్టర్ రమేష్ దొంగచాటుగా ఆడియో టేపు విడుదల చేసి విచారణకు సహకరిస్తానని చెప్పడం సరైంది కాదని ఏసీపీ అభిప్రాయపడ్డారు.  ఆక్సిజన్ సిలిండర్లు, ఫార్మసీ వంటి వాటికి ఏయే ఒప్పందాలు చేసుకొన్నారో కూడ ఆసుప్రతి యాజమాన్యం చెప్పాలని పోలీసులు కోరుతున్నారు.

ప్రభుత్వం నుండి తీసుకొన్న అనుమతుల విషయమై కూడ అనుమతి పత్రాలను కూడ ఇవ్వాలని ఆయన కోరారు. స్వర్ణ ప్యాలెస్ హోటల్, రమేష్ ఆసుపత్రి మధ్య కుదిరిన ఒప్పందాలను ఇంతవరకు తమకు చూపలేదని పోలీసులు గుర్తు చేస్తున్నారు.
 

click me!