విశాఖలో సైకో కలకలం: పుర్రె తిన్న యువకుడు రాజు

Published : Aug 16, 2020, 12:32 PM IST
విశాఖలో సైకో కలకలం: పుర్రె తిన్న యువకుడు రాజు

సారాంశం

విశాఖపట్టణంలోని రెల్లి వీధిలో పుర్రె కలకలకం సృష్టించింది. రాజు అనే యువకుడు పుర్రెను కాల్చుకొని తినడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యాడు.పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొన్నారు.

విశాఖపట్టణం: విశాఖపట్టణంలోని రెల్లి వీధిలో పుర్రె కలకలకం సృష్టించింది. రాజు అనే యువకుడు పుర్రెను కాల్చుకొని తినడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యాడు.పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొన్నారు.

విశాఖపట్టణం రెల్లి వీధిలో జవావాసాల మధ్యే  పాడుబడిన  ఇంట్లో రాజు అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. అతను మద్యం, డ్రగ్స్ కు బానిసగా మారినట్టుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. రాజు చెడు వ్యసనాలకు బానిసగా మారడంతో తల్లి కూడ అతడిని వదిలి వెళ్లింది. చిన్నతనంలోనే రాజు తండ్రి మరణించాడు.

రాజు ఇంటి పక్కనే సుబ్రమణ్యం అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. సుబ్రమణ్యం ఇంటికి సమీపంలో ప్లాస్టిక్ కవర్ ఉంది. ఈ కవర్ ను సుబ్రమణ్యం తెరిచి చూశాడు. ఈ కవర్లో మనిషి పుర్రె కన్పించింది.దీంతో ఆయన పెద్దగా కేకలు పెట్టాడు. దీంతో స్థానికులు అక్కడికి చేరుకొన్నారు.

సుబ్రమణ్యం అసలు విషయం చెప్పాడు. స్థానికులు రాజు ఉంటున్న ఇంట్లో చూశాడు. అక్కడ రాజు పుర్రెను కాల్చుకొని తినడాన్ని స్థానికులు చూసి షాకయ్యారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

రాజు ఉంటున్న ఇంట్లోనే ఓ యువతిని కూడ పోలీసులు గుర్తించారు. రాజు తరచుగా ఈ ప్రాంతానికి యువతీ  యువకులను తీసుకువస్తారని స్థానికులు చెబుతున్నారు. అయితే వీరంతా ఇక్కడ డ్రగ్స్ సేవిస్తారని స్థానికులు అనుమానిస్తున్నారు.

రాజుతో పాటు అతనితో ఉన్న యువతిని కూడ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్