సచివాలయ ఉద్యోగులు ఆందోళన చెందొద్దు.. - ఏపీ హౌసింగ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్

By team teluguFirst Published Jan 11, 2022, 5:31 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అసవరం లేదని హౌసింగ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ అన్నారు. మంగళవారం స‌చివాల‌య ఉద్యోగ సంఘాల నాయ‌కుల‌తో భేటి అయిన అనంతరం మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అసవరం లేదని హౌసింగ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ (housing special chief secratary ajay jain) అన్నారు. మంగళవారం స‌చివాల‌య ఉద్యోగ సంఘాల నాయ‌కుల‌తో ఆయ‌న స‌మావేశం అయ్యారు. అనంత‌రం అజ‌య్ జైన్ మాట్లాడారు.పదకొండు డిపార్ట్ మెంట్లతో లింక్ అయి ఉన్న విభాగాలు ఉన్నందున ప్రొబేషన్ డిక్లెరేషన్ (probhation declaration) ప్రక్రియ కొంచెం ఆల‌స్య‌మైంద‌ని తెలిపారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని స‌చివాల‌య ఉద్యోగుల్లో 60 వేల మందికి అన్ని అర్హ‌త‌లు ఉన్న‌ట్టు ఇంత‌కు ముందే గుర్తించామ‌ని చెప్పారు.  అయితే మిగితా అంద‌రూ అర్హ‌త సాధించిన త‌రువాత డిక్లెరేష‌న్ చేస్తామ‌ని చెప్పారు. 

ఏపీ సీఎం జ‌గ‌న్ (ap cm ys jagan) ప్ర‌త్యేకంగా ప్ర‌త్యేక శ్ర‌ద్ద తీసుకొని ఈ నియామ‌కాలు జ‌రిపార‌ని తెలిపారు. ఈ ఉద్యోగుల‌కు ఎప్పుడూ అన్యాయం జ‌ర‌గ‌బోద‌ని అజ‌య్ జైన్ తెలిపారు. స‌చివాల‌య ఉద్యోగుల‌కు ఇబ్బందులు త‌లెత్త‌బోవ‌ని అన్నారు. ఈ విష‌యాల‌న్ని ఉద్యోగులు గ‌మ‌నించాల‌ని కోరారు. కొంద‌రు కావాల‌నే స‌చివాల‌య ఉద్యోగుల‌ను రెచ్చ‌గొడుతున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. ఉద్యోగుల‌కు లేని పోని అపోహ‌లు క‌లుగ చేస్తున్నార‌ని అన్నారు. ఈ మాట‌లు న‌మ్మి స‌చివాల‌య ఉద్యోగులు మోస‌పోవ‌ద్ద‌ని సూచించారు. స‌చివాల‌య ఉద్యోగుల‌ను ప్రొబేష‌న‌రీ పీరెయిడ్ డిక్ల‌రేష‌న్ చేయ‌డానికి ప్ర‌భుత్వం చిత్త‌శుద్ధితో ఉంద‌ని చెప్పారు. వెంట‌నే అంద‌రూ ఉద్యోగులు విధుల్లో చేరాల‌ని ఆయ‌న కోరారు. 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం  అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నేరుగా ప్రజల వద్దకు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం  స‌చివాల‌య ఉద్యోగ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా 1.34 లక్షల మందిని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగులుగా నియమించింది. గ‌తేడాది అక్టోబరు (octobar) 2తో తొలుత విధుల్లో చేరిన  గ్రామ, వార్డు  సచివాలయ ఉద్యోగుల రెండేళ్ల సర్వీసు పూర్తైంది. దీంతో వారిని రెగ్యుల‌ర్ చేస్తార‌ని ఎంతో ఆశ‌తో ఎదురుచూస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు వారిని రెగ్యుల‌ర్ చేస్తున్న‌ట్టు ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌న రాక‌పోవ‌డంతో ఉద్యోగులు ఇలా ఆందోళ‌న బాట ప‌డుతున్నారు. 

తమను రెగ్యులర్ (reguler) చేయడంతో పాటు సమస్యలు పరిష్కరించాలని సచివాలయ ఉద్యోగులు గ‌తేడాది నుంచి నిర‌స‌న‌లు చేప‌డుతున్నారు. అందులో భాగంగానే నిన్న కృష్ణా, గుంటూరు జిల్లాలో స‌చివాల ఉద్యోగులు ఆందోళ‌న చేశారు. 3 నెలల క్రితమే తమ ప్రొఫెషన్ డిక్లేర్ చేయాల్సి ఉంద‌ని అన్నారు. అయినా ఇప్పటివరకూ ఏపీ ప్రభుత్వం ఆ పని చేయలేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీంతో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు వాపోయారు. స‌చివాల‌య ఉద్యోగులకు ప్ర‌భుత్వం ఇచ్చే రూ. 15 వేల జీతంతో ప‌ని చేయ‌డం చాలా క‌ష్టంగా ఉంద‌ని తెలిపారు.  పెళ్లైన వారికి ఈ జీతం ఎటూ స‌రిపోవ‌డం లేద‌ని అన్నారు. ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ చెప్పిన విధంగా త‌మను రెగ్యుల‌ర్ చేసి జీతాలు చెల్లించాల‌ని అన్నారు. అనంత‌రం అధికారుల‌కు విన‌తిప‌త్రాలు అంద‌జేశారు. ఈ నిర‌స‌నల నేప‌థ్యంలోనే ఈ రోజు స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ ఉద్యోగ సంఘాల నాయ‌కుల‌తోనే స‌మావేశం నిర్వ‌హించారు. 
 

click me!