ఏపీ నైట్ కర్ఫ్యూలో మార్పులు: సంక్రాంతి తర్వాతే అమలు

By narsimha lode  |  First Published Jan 11, 2022, 3:25 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  నైట్ కర్ప్యూను సంక్రాంతి తర్వాత అమలు చేయాలని జగన్ నర్కార్ నిర్ణయం తీసుకొంది. కరోనా కేసుల వ్యాప్తిని నిరోధించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 10వ తేదీ నుండి నైట్ కర్ఫ్యూను అమలు చేయాలని నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే.


 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూలో Ys Jagan సర్కార్ మార్పులు చేసింది. Sankranti తర్వాతి నుండి రాష్ట్రంలో night Curfew ను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ నెల 10వ తేదీ నుండే రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను అమలు చేస్తోంది జగన్ సర్కార్. అయితే Andhra pradesh ప్రజలు సంక్రాంతి పర్వదినాన్ని పెద్ద ఎత్తున జరుపుకొంటారు. దీంతో రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను అమలు చేయడం వల్ల ప్రజలు  ఇబ్బంది పడే అవకాశం ఉందని భావించి ఈ మార్పులు చేసినట్టుగా భావిస్తున్నారు. ఈ నెల 18వ తేదీ నుండి నైట్ కర్ఫ్యూను అమలు చేయాలని మంగళవారం నాడు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు  జారీ చేసింది.

Latest Videos

undefined

ఈ నెల 31వ తేదీ వరకు రాత్రి పూట కర్ఫ్యూను అమలు చేయనున్నారు. రాత్రి 11 గంటల నుండి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది.ఫార్మసీ దుకాణాలు, మీడియా సంస్థలు, టెలి కమ్యూనికేషన్లు, ఐటీ, విద్యుత్ సేవలు, పెట్రోల్ బంకులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వైద్యులు, సిబ్బంది, విమానాశ్రయాలకు వెళ్లే ప్రయాణీకులకు నైట్ కర్ఫ్యూ నుండి మినహాయింపు ఇచ్చారు. 

నైట్ కర్ఫ్యూతో పాటు కరోనా ఆంక్షలను కూడా కఠినంగా అమలు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించకపోతే రూ.10 నుండి రూ. 15 వేల వరకు ఫైన్ విధించనున్నారు.  షాపింగ్ మాల్స్, దుకాణాల వద్ద కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. సినిమా థియేటర్లో 50 శాతం ఆక్యుపెన్సీతో నడపాలని ఆదేశించింది. ఆర్టీసీ సహా ప్రజా రవాణా వ్యవస్థల్లో మాస్కులు తప్పనిసరి చేసింది జగన్ సర్కార్.సోమవారం నాడు వైద్య ఆరోగ్య శాఖాధికారులతో సమీక్ష నిర్వహించిన జగన్ రాష్ట్రంలో నిన్నటి నుండే రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేయాలని నిర్ణయం తీసుకొన్నారు.

దేవాలయాలు, ప్రార్థనామందిరాల్లో భౌతికదూరం తప్పనిసరిగా పాటించేలా చూడాలని సీఎం జగన్ కోరారు. బహిరంగ కార్యక్రమాల్లో 200 మందికి మించకూడదని..  ఇండోర్‌ కార్యక్రమాల్లో 100 మందికి మించకూడదని సీఎం జగన్ ఆదేశించారు. 50 శాతం సామర్థ్యంతో థియేటర్లు నడపాలని థియేటర్లలో సీటు మార్చి సీటుకు అనుమతించాలని చెప్పారు. 

కోవిడ్ కొత్త వేరియంట్ నేపథ్యంలో మందుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. వైద్య నిపుణులతో సంప్రదించి మందులు సిద్దం చేయాలని ఆ మేరకు కోవిడ్ హోం కిట్లలో మార్పులు చేయాలని సూచించారు. చికిత్సకు ఉపయోగించే మందుల నిల్వలపై సమీక్ష చేయాలి అవసరమైన మేర కొనుగోలు చేసి సిద్దంగా ఉంచాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. 104 కాల్ సెంటర్లను పటిష్టపరచాలని అధికారులకు సూచించారు. కోవిడ్ కేర్ సెంటర్లను సిద్దం చేయాలని అన్నారు. నియోజకవర్గానికి ఒక కోవిడ్ కేర్ సెంటర్ ఉండాలని చెప్పారు.

దేశంలో కూడా కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఎల్లుండి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ భేటీ కానున్నారుఈ సమావేశంలో కరోనాపై కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. 

 


 

click me!