
కొత్త వేయి రుపాయ నోట్లు రావడం లేదు. నోట్లరద్దు సంక్షోభంలో కూరుకుపోయిన కేంద్రం
కొత్త డిజైన్‌తో వెయ్యి రూపాయల నోట్లను విడుదల చేయాలన్న అలోచనను విరమించుకుంది.
ఈ విషయాన్ని వెల్లడించారు.
నోట్ల కోసం క్యూలో నిలబడ్డ ప్రజలకు పరిమితి ప్రకారం కూడా నోట్లు అందించ లేని పరిస్థితి ఎదురవడంతో పరిమితి తగ్గించాలని కేంద్రం నిర్ణయించిందని ఆయన విలేకరులకు చెప్పారు.
ఈ పరిమితిని నాలుగు వేల అయిదొందల నుంచి రు. 2 వేలకు తగ్గిస్తున్నారు. ఇది రేపటి నుంచి అమలులోకి వస్తుంది. రెండు వేల రుపాలయకు ఎందుకు సరిపోతాయి. ఇది కొత్త సమస్య సృష్టించే ప్రమాదం ఉంది. నిధుల దుర్వినియోగం నివారించేందుకు ఈ చర్య కు పూనుకున్నట్లు ఆయన ఒకప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
పరిమితిని నాలుగువేల అయిదొందల నుంచి రు.2 వేల తగ్గిస్తున్న విషయాన్ని కేంద్ర ఆర్థిక కార్యదర్శి శక్తి కాంత దాస్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఎటిఎం మిషన్ల ను కొత్త నోట్లకు అనుకూలంగా మార్చే ప్రక్రియ (రీక్యాలిబ్రేట్) ప్రారంభమయిందని, ఇప్పటి దాకా దాదాపు 22500 ఎటిఎంలలో ఇది పూర్తయిందని ఆయన చెప్పారు. దేశంలో మొత్తం 2.5 లక్షల ఏటిఎంలున్నాయి.
ఈ రీ కాలిబ్రేట్ పూర్తయిన ఎటి ఎంలనుంచి కొత్త పెద్ద నోటు, రు. 2000 లను విడుదల చేసుకోవచ్చని ఆయన చెప్పారు. దీనితో ఎటిఎంలలో రు.100, రు.500, రు.2000 అందుబాటులో ఉంటాయి.
ప్రజలకు పెద్ద గా ఇబ్బందులు లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నట్లు చెబుతూ వివాహానికి రు. 2.5 లక్షలు బ్యాంకుల నుంచి తీసుకునే వెసలుబాటు కల్పించినట్లు ఆయన చెప్పారు.
.
.