వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లతో నష్టం లేదు: ఏపీ అసెంబ్లీలో జగన్

By narsimha lode  |  First Published Sep 21, 2022, 5:22 PM IST


 వ్యసాయ విద్యుత్ మోటార్లకు మీటర్ల బిగింపుతో మంచి జరుగుతుందని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు.  నాణ్యమైన విద్యుత్ రైతులకు అందుతుందన్నారు. 


అమరావతి:  వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగింపుతో జరిగే మంచిని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు.ఈ విషయమై టీడీపీ, దుష్టచతుష్టయం తప్పుడు ప్రచారం చేస్తుందని ఆయన విమర్శించారు. 

బుధవారం నాడు ఏపీ అసెంబ్లీలో వ్యవసాయం, అనుబంధ రంగాలపై జరిగిన చర్చలో సీఎం జగన్ పాల్గొన్నారు. వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగింపు విషయ మై ఒక్క పైసా తీసుకోవడం లేదని సీఎం జగన్ స్పష్టం చేశారు. వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్ల బిగింపుతో  నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్నట్టుగా సీఎం జగన్ వివరించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపుతో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోవన్నారు.  క్వాలిటీ లేకపోతే రైతు నష్టపోతాడన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపు విషయమై కొందరు తెలిసీ తెలియక మాట్లాడుతున్నారని సీఎం జగన్ విమర్శించారు. 

Latest Videos

undefined

also ead:పంట రుణ మాఫీపై ఊసరవెల్లిలా మాటలు: చంద్రబాబుపై జగన్ ఫైర్

వ్యవసాయానికి పగటిపూట 9 గంటల పాటు ఉచిత విద్యుత్ ను సరఫరా చేస్తున్నామన్నారు.  తాను సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే  పీడర్లు, సబ్ స్టేషన్లను అప్ గ్రేడ్ చేయడం కోసం రూ. 1700 కోట్లు మంజూరు చేశామన్నారు. ఈ కారణంగానే పగటిపూట రైతులకు ఉచితంగా 9 గంటల పాటు విద్యుత్ ను అందిస్తున్నామన్నారు. అంతేకాదు ప్రతి ఏటా దీని కోసం రూ. 9 వేల కోట్లను చెల్లిస్తున్నామని సీఎం జగన్ వివరించారు. 18 లక్షల 70వేల వ్యవసాయ మోటార్లకు ఉచితంగా  విద్యుత్ ను అందిస్తున్నామన్నారు సీఎం.  గత ప్రభుత్వం సుమారు రూ. 9 వేల కోట్లు బకాయిలు పెడితే ఆ భారాన్ని కూడా తామే చెల్లించినట్టుగా సీఎం తెలిపారు. 

రైతులు ఆత్మహత్యలు చేసుకొంటే  ఆ కుటుంబానికి రూ. 7 లక్షలను ప్రభుత్వం అందిస్తుందని సీఎం చెప్పారు. గత ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరించిందన్నారు.  చంద్రబాబు హయంలో మరణించిన రైతులకు కూడా పరిహరం చెల్లించినట్టుగా సీఎం జగన్ వివరించారు. పట్టాదారు పాసుపుస్తకాలున్న ప్రతి రైతు కుటుంబాలను ఆదుకొన్నామని సీఎం జగన్ చెప్పారు. 

click me!