మావోయిస్టు అగ్రనేత ఆర్‌కె మృతిపై ఆయన భార్య శిరీష స్పందించారు.ఆర్‌కె మృతికి సంబంధించి పార్టీ నుండి ఎలాంటి సమాచారం రాలేదన్నారు. ఆర్‌కె బౌతిక కాయాన్ని ఏదైనా గ్రామానికి అప్పగిస్తే చివరి చూపు చూసుకొంటామన్నారు.
గుంటూరు: మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ RKమృతి గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని ఆర్‌కె సతీమణి sirisha చెప్పారు.శుక్రవారం నాడు ఆమె ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు.Chhattisgarh Dgp ఈ విషయమై మీడియాలో చేసిన ప్రకటనను మాత్రమే తాను చూశానని ఆమె తెలిపారు. పోలీసులకు తెలిసిన సమాచారం సామాన్యులకు కూడ తెలుస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.
also read:బీజాపూర్ : మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే కన్నుమూత
ఆర్‌కె మృతి గురించి మావోయిస్టు పార్టీ నుండి సమాచారం రాలేదన్నారు. ఈ సమాచారం బయటకు పంపే అవకాశం పార్టీకి లేని కారణంగా కూడా ఆలస్యమై ఉండొచ్చనే అభిప్రాయాన్ని కూడ ఆమె వ్యక్తం చేశారు.ఆర్‌కె మృతి చెందితే ఆయన భౌతిక కాయాన్ని ఏదైనా గ్రామానికి అప్పగిస్తే చివరి చూపు చూసుకొంటామని శిరీష చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వం కూడా సహకరించాలని ఆమె అభ్యర్ధించారు.
ఆర్‌కె అనారోగ్యంగా ఉన్న సమయంలో ఆయనకు మందులు అందకుండా పోలీసులు చూశారని ఆమె ఆరోపించారు. అడవుల్లో ఉన్న Maoistలకు కనీసం ఆహార పదార్ధాలు కూడ అందకుండా చేస్తున్నారన్నారు.ఈ కారణంగానే ఆకలితో మావోయిస్టులు అలమటిస్గున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజల కోసం వారి తరపున పోరాటం చేస్తున్న మావోయిస్టులను పోలీసులు వెంటాడి వేటాడి చంపుతున్నారని శిరీష ఆరోపించారు. మావోయిస్టులకు అందే ఆహారపదార్దాలతో పాటు మందులను కూడా విషతుల్యం చేస్తున్నారని ఆమె చెప్పారు.ఆర్‌కెను ప్రభుత్వమే హత్య చేసిందని శిరీష ఆరోపించారు.
ఇటీవల కాలంలో తమ బందీగా ఉన్న జవాన్ ను మావోయిస్టులు మానవతా థృక్పథంలో విడిచిపెట్టారని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎవరికో ఒకరికి సంపదను పోగు చేసుకొనేందుకు ఈ ప్రభుత్వాలు సహకరిస్తున్నాయని, అయితే ఈ సంపద ప్రజలకు చెందాలని మావోయిస్టులు పోరాటం చేస్తున్నారన్నారు.
ఆర్‌కెతో తనకు 30 ఏళ్ల అనుబంధం ఉందని శిరీష గుర్తు చేసుకొన్నారు. ఆర్‌కెతో మాట్లాడి చాలా ఏళ్లు అవుతోందని ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు.ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని బస్తర్ జిల్లాల్లో మావోయిస్టు అగ్రనేత ఆర్‌కె అనారోగ్యంతో మరణించాడని గురువారం నాడు ఆ రాష్ట్ర డీజీపీ ప్రకటించారు. మావోయిస్టు పార్టీలో కేంద్ర కమిటీ సభ్యుడి స్థాయికి ఎదిగిన రామకృష్ణ అలియాస్ పై పలు కేసులు నమోదయ్యాయి. ఆయనపై కోటికి పైగా రివార్డు ఉంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా Ys Rajasekhar Reddy ఉన్న సమయంలో మావోయిస్టులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. ఈ చర్చలకు మావోయిస్టు ప్రతినిధిగా ఆర్‌కె అడవి నుండి బయటకు వచ్చాడు. ఆ తర్వాత జరిగిన ఎన్‌కౌంటర్లలో ఆయన పలమార్లు తృటిలో తప్పించుకొన్నాడు.