ముఖ్యమంత్రి జగన్, (ys jagan) ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై (sajjala rama krishna reddy) సెటైర్లు వేశారు వైసీపీ (ysrcp) రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు (raghu rama krishnam raju)
ముఖ్యమంత్రి జగన్, (ys jagan) ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై (sajjala rama krishna reddy) సెటైర్లు వేశారు వైసీపీ (ysrcp) రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు (raghu rama krishnam raju). గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్ నవరత్నాల్లో ఒక రత్నం రాలిపోయిందని ఎద్దేవా చేశారు. అమ్మఒడి (amma vodi) నిధులను జూన్ నెలకు మార్చడంతో ఒక ఏడాది ఎగ్గొట్టినట్లేనని రఘురామ దుయ్యబట్టారు. ప్రభుత్వ నిర్ణయంతో అమ్మఒడిని నమ్ముకున్న చిన్నారుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ సమస్య తలెత్తినా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డే మాట్లాడుతున్నారని... ఆయన ఒక్కోసారి సీఎంగా కూడా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. రేపో మాపో సజ్జల మంత్రి అవుతారని... అప్పుడు ఆయన ఒక మంత్రిత్వ శాఖను మాత్రమే చూస్తారా? లేక సకల శాఖలను చూస్తారా? అంటూ రఘురామ సెటైర్లు వేశారు.
వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ. 2.87 లక్షల కోట్ల అప్పులు చేశారని... ప్రభుత్వ ఖజానాలోని రూ. 1.31 లక్షల కోట్లకు లెక్కలు కూడా తేలడం లేదని రఘురామరాజు అన్నారు. ప్రభుత్వ ఆదాయ వ్యయాలు, అప్పులపై పూర్తి వివరాలను వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.
విద్యుత్ సమస్య (power crisis) వల్ల రాష్ట్రం అంధకారంలోకి వెళ్లే పరిస్థితులు తలెత్తాయని దుయ్యబట్టారు. జగనన్న కొవ్వొత్తి-అగ్గిపెట్టె పథకం పెట్టేటట్టు ఉన్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని రఘురామ ఎద్దేవా చేశారు. విద్యుత్ సమస్యపై కోల్ ఇండియా ఛైర్మన్‌తో తాను చర్చించానని... కోల్ ఇండియాకు ఏపీ రూ. 300 కోట్ల బాకీ ఉందని ఆయన తనతో చెప్పారని రఘురామ తెలిపారు.
undefined
ALso Read:అప్పుల కోసం ‘‘ రుణ యజ్ఞం ’’, కొత్త కొత్త మార్గాల్లో యత్నాలు .. జగన్‌పై రఘురామ సెటైర్లు
కొద్దిరోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వ అప్పులపై రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కొత్త కొత్త కోణాల్లో అప్పులు ఎలా తీసుకురావాలనే దానిపై తమ ప్రభుత్వం ఆలోచిస్తోందని ఆయన సెటైర్లు వేశారు. రుణ యజ్ఞం పేరుతో అప్పులు తీసుకొస్తోందని రఘురామ విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం (tdp) ఏపీ స్టేట్ రోడ్ డెవలప్ మెంట్ కింద రూ. 3 వేల కోట్ల రుణం తీసుకొచ్చిందని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు తమ ప్రభుత్వం కొత్తగా ఒక జీవో ఇచ్చి 574 ఎకరాలు, ఆర్ అండ్ బీ ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు తీసుకురావాలనుకుంటోందని రఘురామ ఆరోపించారు.
ప్రజల ఆస్తులను అమ్మే హక్కు ప్రభుత్వానికి ఉండదని .. చెత్త నుంచి సంపదను తయారు చేసే సెంటర్లకు కూడా వైసీపీ పార్టీ రంగులు వేయడంపై హైకోర్టు (high court) చివాట్లు పెట్టిందని ఆయన దుయ్యబట్టారు. మూడు రంగులు వేసే పనులకు ముఖ్యమంత్రి జగన్ ముగింపు పలకాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు డీఏ అడుగుతున్నారని, వారి బకాయిలు పెద్ద ఎత్తున ఉన్నాయని రఘురామ వెల్లడించారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు సరైన సమయానికి పెన్షన్ (pensions) రావడం లేదని ఆయన మండిపడ్డారు.