టీడీపీతో పొత్తు: తేల్చేసిన ఏపీకాంగ్రెస్ చీఫ్ రఘువీరారెడ్డి

First Published Jul 27, 2018, 2:46 PM IST
Highlights

 టీడీపీతో పొత్తు  విషయం పుకారు మాత్రమేనని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు  రఘువీరారెడ్డి  చెప్పారు.  పొత్తుల విషయాన్ని కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ చూసుకొంటారన్నారు.


న్యూఢిల్లీ:  టీడీపీతో పొత్తు  విషయం పుకారు మాత్రమేనని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు  రఘువీరారెడ్డి  చెప్పారు.  పొత్తుల విషయాన్ని కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ చూసుకొంటారన్నారు.

శుక్రవారం నాడు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు  రఘువీరారెడ్డి  మీడియాతో మాట్లాడారు. సీడబ్ల్యూసీ సమావేవంలో  ఏపీ ప్రత్యేక హోదా అంశంపై  రాహుల్ గాంధీ, సోనియాగాంధీలు ఇచ్చిన హమీలకు చెందిన వీడియోలను ఆయన మీడియా సమావేశంలో చూపారు.

ఏపీకి ప్రత్యేక హోదా  హక్కంటూ సీడబ్ల్యూసీ సమావేశంలో  సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు చేసిన ప్రసంగాలను ఆయన  ప్రస్తావించారు. ఏపీ ప్రజల పట్ల సానుకూలంగా వ్యవహరించిన సోనియా,రాహుల్ గాంధీలకు ఆయన  ఏపీ ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు.

వచ్చే ఎన్నికల్లో 25 లోక్‌సభ స్థానాలు కాంగ్రెస్‌కి ఇస్తేనే ప్రత్యేక హోదా సాధ్యం అవుతుందన్నారు.. తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఆయన కుమార్తె కవిత, కుమారుడు కేటీఆర్‌, కేకే, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పిన మాటలను ఆయన గుర్తు చేశారు. 

కానీ, పార్లమెంట్ సమావేశాల్లో మాత్రం ఏపీకి ప్రత్యేక హోదా విషయమై టీఆర్ఎస్ యూ టర్న్ తీసుకొందన్నారు.  రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రస్తుతం యూ టర్న్ తీసుకొన్నారని  రఘువీరారెడ్డి విమర్శలు గుప్పించారు.


 

click me!