ఏ పార్టీతోనూ పొత్తు లేదు, మరిన్ని చేరికలు: ఉమెన్ చాందీ

First Published Aug 1, 2018, 4:17 PM IST
Highlights

 వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ తాము పొత్తు పెట్టుకోబోమని  ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ ఉమెన్ చాందీ ప్రకటించారు. ప్రజలతోనే తమ పార్టీ పొత్తు పెట్టుకొంటుందని చెప్పారు.
 


విజయవాడ: వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ తాము పొత్తు పెట్టుకోబోమని  ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ ఉమెన్ చాందీ ప్రకటించారు. ప్రజలతోనే తమ పార్టీ పొత్తు పెట్టుకొంటుందని చెప్పారు.
బుధవారం నాడు  విజయవాడలో నిర్వహించిన  కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సమావేశంలో  ఆయన పాల్గొన్నారు.  కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి, టీడీపీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

వచ్చే ఎన్నికల్లో  తమ పార్టీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని చెప్పారు. ప్రజలతోనే తమ పార్టీ పొత్తు పెట్టుకొందని చెప్పారు. పార్టీని బూత్‌స్థాయి నుండి బలోపేతం చేస్తామని ఆయన  చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హమీ చట్టం, రాష్ట్రాభివృద్ధి తదితర అంశాలను ఎన్నికల్లో తమ ప్రచార అస్త్రాలుగా తీసుకొంటామని ఆయ న చెప్పారు.కిరణ్ కుమార్‌రెడ్డి‌, బైరెడ్డి రాజశేఖరరెడ్డి కాంగ్రెస్‌లోకి రావడం సంతోషంగా ఉందన్నారు.

కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే  ఏపీకి ప్రత్యేక హోదాను కల్పిస్తామని ఆయన చెప్పారు.  కాంగ్రెస్ పార్టీని ఏపీ ప్రజలు ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నారు. త్వరలోనే  ఏపీ రాష్ట్రంలో ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని ఉమెన్ చాందీ చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ చేపట్టిన తీర్మానాలను అమలు చేసేందుకు గాను అక్టోబర్ 2 నుండి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తామని కాంగ్రెస్ నేత పళ్లంరాజు తెలిపారు.అక్టోబర్‌ 31 నుంచి నవంబర్‌ 19వరకు రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని, కాపు రిజర్వేషన్లకు కాంగ్రెస్‌ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. త్వరలో ఏపీలో రాహుల్‌గాంధీ పర్యటిస్తారని, ఆగస్టు 3న కర్నూలులో రాహుల్‌ బహిరంగ సభ నిర్వహిస్తామని పళ్లంరాజు పేర్కొన్నారు.

ఈ వార్త చదవండి:ఏపీలో కాంగ్రెస్ ప్లాన్ ఇదే: కిరణ్ వ్యూహం ఫలించేనా?
 

click me!