సెల్ ఫోన్ పేలి వికలాంగుడి మృతి

First Published Aug 1, 2018, 1:39 PM IST
Highlights

సెల్ ఫోన్ పేలి ఓ వికలాంగుడు దుర్మరణం పాలైన దుర్ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. రాత్రి పడుకునే సమయంలో సెల్ ఫోన్ చార్జింగ్ పెట్టి, దాన్ని తన కడుపుపై పెట్టుకుని నిద్రిస్తుండగా పేలిపోయింది. దీంతో ఆ దివ్యాంగుడు నిద్రలోనే మృతిచెందాడు. 
 

సెల్ ఫోన్ పేలి ఓ వికలాంగుడు దుర్మరణం పాలైన దుర్ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. రాత్రి పడుకునే సమయంలో సెల్ ఫోన్ చార్జింగ్ పెట్టి, దాన్ని తన కడుపుపైపెట్టుకుని  నిద్రిస్తుండగా పేలిపోయింది. దీంతో ఆ దివ్యాంగుడు నిద్రలోనే మృతిచెందాడు. 

వివరాల్లోకి వెళితే...ప్రకాశం జిల్లా కనిగిరి మండలం వాగుపల్లి గ్రామానికి చెందిన మస్తాన్ రెడ్డి (30) వికలాంగుడు. ఇతడి తల్లిదండ్రలు చిన్నపుడే చనిపోవడంతో ఒంటరిగా ఉంటున్నాడు. ఇంట్లోనే చిన్న తినుబండారాల దుకాణం పెట్టుకుని స్వయం ఉపాధి పొందుతున్నాడు.

అయితే అతడు సోమవారం రాత్రి తన ఇంట్లో సెల్ ఫోన్ ను చార్జింగ్ పెట్టి...దాన్ని తన కడుపుపై పెట్టుకుని నిద్రించాడు. అతడు అలాగే నిద్రలోకి జారుకున్నాడు. ఈ సమయంలో షాట్ సర్క్యూట్ ఏర్పడటంతో చార్జింగ్ పెట్టిన మస్తాన్ రెడ్డి పొట్టపైవున్న సెల్ ఫోన్ పేలింది. దీంతో అతడు అక్కడిక్కడే ప్రాణాలు వదిలాడు.

తెల్లవారాక కూడా దుకాణం తెరవక పోవడంతో అనుమానం వచ్చిన చుట్టుపక్కల వాళ్లు ఇంట్లోకి వెళ్లి చూడగా కాలిన గాయాలతో  మస్తాన్ శవమై పడివున్నాడు. దీంతో వారు పోలీసుులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. 

ఈ ఘటన జరిగిన రాత్రే గ్రామంలోని కొన్ని ఇళ్లలో ఎలక్ట్రిక్ వస్తువులు కాలిపోయనట్లు పోలీసులు గుర్తించారు. ఇలాగే సెల్ ఫోన్ కూడా పేలి ఉంటుందని భావిస్తున్నామని, విచారణ తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తామని పోలీసులు చెబుతున్నారు.  
 

click me!