ప్యాకేజికి చట్టబద్దత లేనట్లేనా?

Published : May 27, 2017, 04:17 PM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
ప్యాకేజికి చట్టబద్దత లేనట్లేనా?

సారాంశం

మన్మోహన్ సింగ్ పార్లమెంట్ లో ప్రకటించిన ప్రత్యేకహోదానే నరేంద్రమోడి లెక్క చేయనప్పుడు  జైట్లీ తన ఇంట్లో కూర్చుని చేసిన ప్యాకేజి ప్రకటనకున్న విలువేంటి? అయినా ప్యాకేజి విషయం జైట్లీ చెప్పటమేంటి? పిఎంఓ హామీ ఇవ్వటమేంటో? అంటే ఇంతకాలం చంద్రబాబు చెబుతున్న ప్యాకేజికి చట్టబద్దత కూడా రాదన్నమాట.

‘ప్రత్యేక ప్యాకేజి ఇస్తామని అరుణ్ జైట్లీ చెప్పారు, పిఎంఓ హామీ ఇచ్చింది’ ...ఇది చంద్రబాబునాయుడు తాజాగా చెప్పిన మాటలు. విశాఖపట్నంలో మొదలైన మహానాడు కార్యక్రమంలో మాట్లాడుతూ, ప్రత్యేకహోదాకు మించిన ప్రయోజనాలతో ప్రత్యేకప్యాకేజి ఇస్తామంటేనే తాను ప్యాకేజికి అంగీకరించినట్లు చెప్పారు. హోదా ఇవ్వలేమని అంటే సరే ప్యాకేజీ అన్నా వస్తుంది కదా అని అంగీకరించినట్లు చంద్రబాబు స్పష్టం చేసారు. అంటే, ఇంతకాలం ప్యాకేజికి వస్తుందన్న చట్టబద్దత కూడా రాదన్న విషయం చంద్రబాబు చెప్పకనే చెప్పారన్నమాట.

మరి, ఇంతకాలం ప్రత్యేక ప్యాకేజికి చట్టబద్దత వస్తుందని ఎందుకు చెబుతున్నట్లు? ప్రత్యేకప్యాకేజికి చట్టబద్దత లేదంటే కేంద్రప్రభుత్వ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాలన్నమాట. ఎందుకంటే, మన్మోహన్ సింగ్ పార్లమెంట్ లో ప్రకటించిన ప్రత్యేకహోదానే నరేంద్రమోడి లెక్క చేయనప్పుడు  జైట్లీ తన ఇంట్లో కూర్చుని చేసిన ప్యాకేజి ప్రకటనకున్న విలువేంటి? అయినా ప్యాకేజి విషయం జైట్లీ చెప్పటమేంటి? పిఎంఓ హామీ ఇవ్వటమేంటో? అంటే ఇంతకాలం చంద్రబాబు చెబుతున్న ప్యాకేజికి చట్టబద్దత కూడా రాదన్నమాట. మొత్తానికి ‘చావుకబురు చల్లగా చెప్పటమంటే’ ఇదేనేమో.

 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: ఎన్టీఆర్ ఒక చరిత్ర సృష్టించారు చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu
Minister Gottipati Ravi Kumar: వైసీపీ పై మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఫైర్ | Asianet News Telugu