జ్వరంతో హాస్పిటల్ కు వచ్చిన తొమ్మిదేళ్ల చిన్నారిపై అత్యాచారం.. !

Published : Oct 02, 2021, 10:19 AM IST
జ్వరంతో హాస్పిటల్ కు వచ్చిన తొమ్మిదేళ్ల చిన్నారిపై అత్యాచారం..  !

సారాంశం

బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. షిర్డిసాయి క్లినిక్ ను ఆర్ఎంపీ ఆదినారాయణ నిర్వహిస్తున్నాడు. కొత్త చెరువు మండలం కేశాపురం గ్రామానికి చెందిన తొమ్మిదేళ్ల బాలికకు జ్వరంగా ఉండటంతో శుక్రవారం తల్లిదండ్రులు క్లినిక్ కు తీసుకొచ్చారు. 

అనంతపురం : పుట్టపర్తిలో (Puttaparthi) దారుణం చోటు చేసుకుంది. కొత్త చెరువు పట్టణంలోని షిర్డిసాయి క్లినిక్ లో (RMP clinic) శుక్రవారం దారుణం జరిగింది. జ్వరానికి చికిత్స కోసం వచ్చిన ఓ బాలికపై (Minor) ఆర్ఎంపీ సహాయకుడు అత్యాచారానికి (Rape)పాల్పడ్డాడు. 

బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. షిర్డిసాయి క్లినిక్ ను ఆర్ఎంపీ ఆదినారాయణ నిర్వహిస్తున్నాడు. కొత్త చెరువు మండలం కేశాపురం గ్రామానికి చెందిన తొమ్మిదేళ్ల బాలికకు జ్వరంగా ఉండటంతో శుక్రవారం తల్లిదండ్రులు క్లినిక్ కు తీసుకొచ్చారు. 

పవన్ కల్యాణ్ శ్రమదానంపై ఉత్కంఠ: జనసేన నేతల హౌస్ అరెస్టు

అక్కడ ఆర్ఎంపీ ఆదినారాయణకు చూపించారు. అతను పరీక్షించిన తరువాత ఇంజక్షన్ వేయాలని సహాయకుడు జయరామ్ కు సూచించాడు. జయరామ్ బాలికను ఇంజక్షన్ గదిలోకి తీసుకువెళ్లాడు. తల్లిని గది బయటకు పంపించాడు. తర్వాత దుస్తులు తొలగించి అత్యాచారానికి పాల్పడ్డాడు. 

ఈ ఘటనమీద బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో.. వారు వెంటనే కొత్తచెరువు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు జయరామ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం పెనుగొండ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు పుట్టపర్తి రూరల్ సీఐ నరసింహారావు, కొత్త చెరువు ఎస్ఐ లింగన్న తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఓవైపు చలి, మరోవైపు వర్షాలు... ఆ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!
Deputy CM Pawan Kalyan: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సమావేశంలో పవన్ కీలక ప్రసంగం | Asianet News Telugu