అధికారముందని ఇంత అరాచకమా? మూల్యం చెల్లించక తప్పదు..: మాజీ హోంమంత్రి వార్నింగ్

By Arun Kumar PFirst Published Jun 23, 2021, 1:55 PM IST
Highlights

అచ్చెన్నతో పాటు పల్లా శ్రీనివాస్, పీలా గోవింద్, కూన రవికుమార్ వంటి టిడిపి సీనియర్లను కావాలనే లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. 

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ టిడిపి అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబంపై కోటబొమ్మాళి పోలీసులు బైండోవర్ కేసులు నమోదు చేయడం దురదృష్టకరమని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు,  పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. అచ్చెన్నతో పాటు పల్లా శ్రీనివాస్, పీలా గోవింద్, కూన రవికుమార్ వంటి టిడిపి సీనియర్లను కావాలనే లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి ఉన్మాద చర్యలతో ప్రజలను భయపెట్టి పాలించాలనుకోవడం కుదరదని చినరాజప్ప హెచ్చరించారు. 

''దేశంలో కరోనా కేసులు తగ్గినా ఏపీలో ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు తగ్గడం లేదు. ముఖ్యమంత్రి పాలన గాలికొదిలి  ప్రతిపక్షనేతల్ని, వారి కుటుంబ సభ్యులను వేధిస్తున్నారు. అధికారముందని జగన్ అరాచంగా వ్యవహారిస్తే రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించక తప్పదు'' అని రాజప్ప హెచ్చరించారు. 

''రాష్ట్ర పోలీస్ వ్యవస్థపై న్యాయస్థానాలు వివిధ సందర్భాల్లో తప్పు బట్టిన వారిలో మార్పు రావడం లేదు. వైసీపీ నేతలు చెప్పినట్లు పోలీసులు వ్యవహరిస్తే ముందురోజుల్లో ఇబ్బందులు తప్పవు. ఐఎఎస్ అధికారులు కూడా ముఖ్యమంత్రి ఆదేశాలతో నియమ నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రాబోయే రోజుల్లో అధికారులు చిక్కులో పడే అవకాశం ఉంది'' అని చినరాజప్ప హెచ్చరించారు.

read more  లోకేష్ ను అంతమొందించడానికి వైసిపి కుట్ర...: బుద్దా వెంకన్న సంచలనం

మాజీ సీఎం, టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు కూడా టిడిపి నాయకులపై నమోదవుతున్న కేసులపై స్పందించారు. వైసీపీ పాలనలో  రాజ్యాంగం, చట్టం అడుగడుగునా దుర్వినియోగం అవుతున్నాయన్నారు.  

''హరివరప్రసాద్, సురేష్, కృష్ణమూర్తిపై పోలీసులు పెట్టిన అక్రమ రౌడీషీట్ వెంటనే ఎత్తి వేయాలి. అక్రమ కేసులకు రౌడీషీట్లకు భయపడే నాయకులు టీడీపీలో లేరు. రాజారెడ్డి రాజ్యాంగానికి మరో మూడేల్లే వ్యాలీడిటి. అధికారం ఉంది కదా అని జగన్ రెడ్డి అరాచకంగా వ్యవహరించడం తగదు'' అని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. 
 

click me!