మూడేళ్లే వ్యాలిడిటీ... ఆపై మూడింతలు మూల్యం చెల్లించక తప్పదు: చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

By Arun Kumar PFirst Published Jun 23, 2021, 12:29 PM IST
Highlights

అధికారం ఉంది కదా అని అరాచకంగా వ్యవహరిస్తే ముందు రోజుల్లో మూడింతలు మూల్యం చెల్లించక తప్పదు అని వైసిపి నాయకులను చంద్రబాబు హెచ్చరించారు. 
 

అమరావతి: దేశంలో కరోనా కేసులు తగ్గినా ఏపీలో  ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు తగ్గడం లేదంటూ మాజీ సీఎం, టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. అధికారం ఉంది కదా అని అరాచకంగా వ్యవహరిస్తే ముందు రోజుల్లో మూడింతలు మూల్యం చెల్లించక తప్పదు అని వైసిపి నాయకులను చంద్రబాబు హెచ్చరించారు. 

''వైసీపీ పాలనలో  రాజ్యాంగం, చట్టం అడుగడుగునా దుర్వినియోగం అవుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ పాలనను గాలికొదిలి ప్రతిపక్ష పార్టీ నేతల్ని, వారి కుటుంబ సభ్యుల్ని వేధిస్తున్నారు. అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులపై కోటబొమ్మాళి పోలీసులు బైండోవర్ కేసులను నమోదు చేయడాన్ని ఖండిస్తున్నాం.  పోలీసులు వైసీపీ నేతలు చెప్పినట్టు వ్యవహరిస్తే ముందు రోజుల్లో ఇబ్బందులు తప్పవు'' అని చంద్రబాబు హెచ్చరించారు. 

''హరివరప్రసాద్, సురేష్, కృష్ణమూర్తిపై పోలీసులు పెట్టిన అక్రమ రౌడీషీట్ వెంటనే ఎత్తి వేయాలి. అక్రమ కేసులకు రౌడీషీట్లకు భయపడే నాయకులు టీడీపీలో లేరు. రాజారెడ్డి రాజ్యాంగానికి మరో మూడేల్లే వ్యాలీడిటి. అధికారం ఉంది కదా అని జగన్ రెడ్డి అరాచకంగా వ్యవహరించడం తగదు'' అని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. 

read more  ఏపీలో ఇంత జరుగుతుంటే ఉదాసీనంగా వుంటారేంటి...: జాతీయ షెడ్యూల్డ్ కులాల కమీషన్ కు వర్ల ఘాటు లేఖ

టిడిపి నాయకులపై తాజాగా పోలీస్ కేసులు పెట్టడంపై బుద్దా వెంకన్న కూడా సీరియస్ అయ్యారు. ఏపీ టిడిపి అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, దివంగత ఎర్రన్నాయుడి కుమారుడు రామ్మోహన్ నాయుడుతో పాటు వారి కుటుంబసభ్యులు, అనుచరులపై రౌడీషీట్లు తెరవడం దుర్మార్గమని వెంకన్న ఆగ్రహం వ్యక్తంచేశారు. 

టీడీపీ శ్రేణులు భయపడి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా బయటకు వచ్చి పోరాడకుండా చేయాలనే విజయసాయి ఇటువంటి తప్పుడు కేసులతో చెలరేగుతున్నాడని వెంకన్న తెలిపారు. ప్రభుత్వం తప్పుడుకేసులపెట్టి 80రోజులు జైల్లోపెట్టినా అచ్చెన్నాయుడు ఎక్కడా వెరవకుండా, వెనకడుగు వేయకుండా పాలకుల దుర్మార్గాలపై పోరాడుతూనే ఉన్నారన్నారు. పోలీసులు చేతిలో ఉన్నారుకదా అని అడ్డగోలుగా వ్యవహరించడం, చంపేస్తాము.. పొడిచేస్తామని బెదిరించడం ఎంతమాత్రం సరైందికాదని బుద్దా హితవు పలికారు. 

రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చే పాలకుల చర్యలను ఎట్టిపరిస్థితుల్లోనూ టీడీపీ సాగనివ్వదన్నారు. చంద్రబాబు నాయుడిని, లోకేశ్ ను బెదిరించి పబ్బం గడుపుకోవాలని అధికారపార్టీ చూస్తోందన్నారు. టీడీపీ కార్యకర్తలను కర్నూల్లో దారుణంగా హతమార్చారని, దానిపై ఆవేశంతో లోకేశ్ మాట్లాడితే దానికే ఆయనపై వీరంగం వేస్తున్నారని వెంకన్నమండిపడ్డారు. లోకేశ్ ఏదో అన్నాడంటూ ఆయన్ని చంపేస్తాము... పొడిచేస్తామనే వారంతా రోజులు  ఎప్పుడూ ఒకేలా ఉండవనే వాస్తవాన్ని గ్రహిస్తే మంచిదన్నారు.  

చంద్రబాబు నాయుడి వారసుడైన లోకేశ్ ను అంతమొందిస్తే ఇక తమకు అడ్డుఉండదనే ఆలోచనలో అధికారపార్టీ ఉన్నట్టుందని బుద్దా సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ లోకేశ్ ని గానీ, చంద్రబాబు నాయుడి మనుషులనుగానీ టచ్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని వెంకన్న తీవ్రస్వరంతో హెచ్చరించారు.  అధికారులు, పోలీసులుచేతిలో ఉన్నారుకదా అని ఏం మాట్లాడినా, ఏం చేసినా చెల్లుతుందనుకుంటే, అంతకంటే మూర్ఖత్వం ఉండబోదన్నారు. 

 
 
 

click me!