నీ తండ్రి వైఎస్సార్ వల్లే కాలేదు... నీతో ఏమవుతుంది: చినరాజప్ప సీరియస్

Arun Kumar P   | Asianet News
Published : Mar 16, 2021, 04:09 PM IST
నీ తండ్రి వైఎస్సార్ వల్లే కాలేదు... నీతో ఏమవుతుంది: చినరాజప్ప సీరియస్

సారాంశం

తండ్రి వైఎస్సార్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్న జగన్ రెడ్డి తాజాగా సీఎం హోదాలో కూడా దోపిడి చేస్తున్నారన్నారని మాజీ హోంమంత్రి రాజప్ప విమర్శించారు. 

 అచ్చంపేట: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో నియంత పాలన సాగుతోందని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షన్ పోకడలతో రాష్ట్రం నాశనమవుతోందన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏపీ సీఐడీ నోటీసులివ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.  

చంద్రబాబుకు సీఐడి అధికారులు ఇచ్చిన నోటీసులపై చినరాజప్ప మాట్లాడుతూ... చంద్రబాబుకు సీఐడీ నోటీసులు ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి కక్షసాధింపులో భాగమేనన్నారు. ప్రస్తుతం జరుగుతున్న చర్యలన్నీ వైసీపీ మైండ్ గేమ్‌ అని అన్నారు. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరగలేదని హైకోర్టు చెప్పినా సీఎం జగన్ తీరు మారడం లేదన్నారు. ఇన్‌సైడ్ ట్రేడింగ్, క్విడ్ ప్రోకో గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదంగా వుందని ఎద్దేవా చేశారు. 

జగన్మోహన్ రెడ్డి  తన అవినీతి మరకలను అందరికీ అంటించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్న జగన్ రెడ్డి తాజాగా సీఎం హోదాలో కూడా దోపిడి చేస్తున్నారన్నారని రాజప్ప విమర్శించారు. 

read more   చట్ట సవరణతోనే అక్రమాలు: అసైన్డ్ భూములపై సీఐడీ అనుమానం

 జగన్మోహన్ రెడ్డి తన తాత రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు కొన్నవారు.. అమ్మినవారు ఎవరూ ఫిర్యాదు చేయలేదని... అయినా చంద్రబాబు కేసులు పెట్టడం ఏంటన్నారు. వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎస్సీనా.. ఎస్టీనా? అని రాజప్ప ప్రశ్నించారు. 

రాజకీయ కక్షతోనే చంద్రబాబుపై జగన్ కేసులు పెడుతున్నారని చినరాజప్ప పేర్కొన్నారు. చంద్రబాబును ఎదుర్కోవడం నీ తండ్రి వైఎస్సార్ వల్లే కాలేదు.. నీవల్ల ఏం అవుతుంది అంటూ జగన్ ను హెచ్చరించారు. జగన్‌రెడ్డి అధికారమదంతో విర్రవీగుతున్నారని రాజప్ప  ఆగ్రహం వ్యక్తం చేశారు.

PREV
click me!

Recommended Stories

తిరుమల వైకుంఠ ద్వార దర్శనంచేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి | Asianet News Telugu
Tirumala Vaikunta Ekadashi: వైకుంఠ ఏకాదశి పర్వదినాన తిరుమలలో స్వర్ణరథం | Asianet News Telugu