నిమ్మగడ్డ రమేష్ తొలగింపు: ఈ నెల 16 లోపుగా అఫిడవిట్‌ దాఖలుకు హైకోర్టు ఆదేశం

Published : Apr 13, 2020, 12:10 PM IST
నిమ్మగడ్డ రమేష్ తొలగింపు: ఈ నెల 16 లోపుగా అఫిడవిట్‌ దాఖలుకు హైకోర్టు ఆదేశం

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవి నుండి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు విషయమై ఈ నెల 16వ తేదీ లోపుగా  అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ హైకోర్టు సోమవారంనాడు ఆదేశించింది.ఈ నెల 20వ  తేదీన ఈ కేసు విచారిస్తామని హైకోర్టు తెలిపింది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవి నుండి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు విషయమై ఈ నెల 16వ తేదీ లోపుగా  అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ హైకోర్టు సోమవారంనాడు ఆదేశించింది.ఈ నెల 20వ  తేదీన ఈ కేసు విచారిస్తామని హైకోర్టు తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవి నుండి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ ఆర్డినెన్స్ ను సవాల్ చేస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో పాటు మరో ఇద్దరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను ఏపీ హైకోర్టు సోమవారం నాడు విచారణకు స్వీకరించింది.

ఈ నెల 16వ తేదీలోపుగా  అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. ఈ ఆఫిడవిట్ పై ఏమైనా అభ్యంతరాలుంటే ఈ నెల 17వ తేదీన కౌంటర్ దాఖలు చేయాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో పాటు మరో ఇద్దరు పిటిషనర్లకు హైకోర్టు సూచించింది.

ఈ కేసును ఈ నెల 20వ తేదీన పూర్తిస్థాయిలో విచారణ చేస్తామని హైకోర్టు దర్మాసనం ప్రకటించింది.ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా కనగరాజ్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 11న నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు 619 జీవో జారీ చేసింది.

also readLనిమ్మగడ్డ రమేష్ కుమార్ ఔట్: ఏపీ ఎన్నికల కమిషనర్ గా జస్టిస్ కనగరాజ్

కనగరాజ్ ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా బాధ్యతలను స్వీకరించారు. దీంతో రమేష్ కుమార్ తో పాటు మరో ఇద్దరు హైకోర్టులో  పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది.కరోనాను పురస్కరించుకొని ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారు రమేష్ కుమార్. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడాన్ని వైసీపీ తీవ్రంగా తప్పుబట్టింది.

PREV
click me!

Recommended Stories

ఒంగోలు పర్యటనలో లోకేష్ ఫాన్స్ ఫాలోయింగ్ చూడండి | Nara Lokesh Ongole Tour
ఏపీ గ్రీన్ కమిటీ ఛైర్మన్‌గా నాగబాబు కీలక ప్రెస్ మీట్| Nagababu Appointed AP Green Committee Chairman