ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు తాడేపల్లి మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కరోనా నివారణకు ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించి కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అయినప్పటికి ఈ వైరస్ మహమ్మారి రాష్ట్రంలో వేగంగా విజృంబిస్తుండటంతో మరింత అప్రమత్తమైన అధికారులు మరింత పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా తాడేపల్లి మున్పిపల్ అధికారులు వినూత్న ప్రయత్నం చేస్తున్నారు.
కరోనా వైరస్ నియంత్రించడానికి ఓ ప్రత్యేక యంత్రాన్ని తెప్పించారు తాడేపల్లి అధికారులు. ఈ యంత్రం సాయంతో పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు మున్సిపల్ సిబ్బంది. తాడేపల్లిలో ప్రత్యేకంగా గుర్తించిన 23 స్లమ్ ఏరియాలో ఈ యంత్రంతో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేస్తున్నారు.
ఈ యంత్రం సాయంతో ఐదు పది మీటర్ల వెడల్పు ఉన్న రోడ్లలో కూడా సులువుగా ద్రావణం పిచికారీ చేయగలుగుతున్నామని... మున్సిపల్ సిబ్బంది పనిని ఈ యంత్రం ఎంతో సులువు చేసిందని తాడేపల్లి మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఆదివారం నాడు రాత్రి 9 గంటల నుండి సోమవారం నాడు ఉదయానికి కొత్తగా 12 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 432కి చేరుకొన్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతూనే వున్నాయి. ఆదివారం రాత్రి 9 గంటల నుండి సోమవారం నాడు ఉదయానికి కొత్తగా 12 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 432కి చేరుకొన్నాయి.