ఎన్ఐఎ అదుపులోకి శ్రీనివాస రావు: న్యాయవాది సలీం వెల్లడి

By Nagaraju TFirst Published Jan 4, 2019, 1:09 PM IST
Highlights

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై దాడి కేసును ఎన్ఐఏకు అప్పగించడంతో నిందితుడిని విచారణ నిమిత్తం ఎన్ఐఏ పోలీసులు అదుపులోకి తీసుకుంటారని నిందితుడు శ్రీనివాసరావు తరపు న్యాయవాది సలీం స్పష్టం చేశారు. 

విశాఖపట్నం: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై దాడి కేసును ఎన్ఐఏకు అప్పగించడంతో నిందితుడిని విచారణ నిమిత్తం ఎన్ఐఏ పోలీసులు అదుపులోకి తీసుకుంటారని నిందితుడు శ్రీనివాసరావు తరపు న్యాయవాది సలీం స్పష్టం చేశారు. 

వైఎస్ జగన్ పై దాడి కేసుకు సంబంధించి ఇప్పటి వరకు నిందితుడు శ్రీనివాస్ పై 307 కింద కేసు నమోదు అయి ఉందని అలాగే అన్ అఫుల్ యాక్ట్ సెక్షన్ 4 కింద, సివిల్ యాక్ట్ సెక్షన్ 3ఏ కింద మరో కేసు నమోదు చేసే అవకావశం ఉందని తెలిపారు. రెండు కేసులు సిట్ దర్యాప్తు చేస్తుందని తెలిపారు. 

అయితే ఎయిర్ పోర్ట్ జోన్ లో దాడి జరిగిన నేపథ్యంలో ఎన్ఐఏ ఆ కోణంలో విచారించే అవకాశం ఉందన్నారు. దీంతో నిందితుడు శ్రీనివాసరావును ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంటుందన్నారు. 

అయితే ఏపీలో విజయవాడలో మాత్రమే ఎన్ఐఏ కోర్టు ఉండటంతో అక్కడ విచారిస్తారా లేక హెడ్ క్వార్టర్ బేగంపేటలో విచారిస్తారా అన్నది తెలియాల్సి ఉందన్నారు. ఒకవేళ విజయవాడలో విచారిస్తే నిందితుడు శ్రీనివాసరావును రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉందన్నారు. 

రిమాండ్ పై ఉన్న ఉత్కంఠను ఆయన కొట్టిపారేశారు. 90 రోజుల వరకు నిందితుడికి రిమాండ్ తరచూ ఉంటుందని తెలిపారు. 90 రోజుల్లో కేసుకు సంబంధించి చార్జ్ షీట్ దాఖలు చెయ్యాలని అప్పటి వరకు రిమాండ్ కొనసాగుతుందని తెలిపారు. 

అదే ఎన్ఐఏ అయితే ఒక సంవత్సరం వరకు రిమాండ్ ఉండదన్నారు. సిట్ దర్యాప్తు సంస్థ అయితే 14 రోజులకు ఒకసారి కోర్టు ఎదుట హాజరుపరచాల్సి ఉంటుందని అదే ఎన్ఐఏ అయితే నెలకు ఒకసారి కోర్టు ఎదుట హాజరుపరుస్తారని స్పష్టం చేశారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

జగన్ పై దాడి కేసులో మలుపు: శ్రీనివాస రావు కస్టడీపై ఉత్కంఠ

జగన్ పై దాడి కేసు: హైకోర్టు ఆదేశాలతో వెంటనే కదిలిన హోంశాఖ

హైకోర్టు ఆదేశం: జగన్ మీద దాడి కేసులో కీలక మలుపు

చంద్రబాబు భయమే నిజమైంది: మొదటికొచ్చిన జగన్ ఆస్తుల కేసు

click me!