జగన్ పై దాడి కేసులో మలుపు: శ్రీనివాస రావు కస్టడీపై ఉత్కంఠ

By Nagaraju TFirst Published Jan 4, 2019, 12:43 PM IST
Highlights

వైసీపీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడికి పాల్పడిన నిందితుడు శ్రీనివాసరావుకు కస్టడీ ముగిసింది. దీంతో విశాఖపపట్నం సెంట్రల్ జైల్లో ఉన్న శ్రీనివాసరావును ఎయిర్ పోర్ట్ జోన్ పోలీసులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జడ్జిముందు ప్రవేశపెట్టనున్నారు. 

విశాఖపట్నం: వైసీపీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడికి పాల్పడిన నిందితుడు శ్రీనివాసరావుకు కస్టడీ ముగిసింది. దీంతో విశాఖపపట్నం సెంట్రల్ జైల్లో ఉన్న శ్రీనివాసరావును ఎయిర్ పోర్ట్ జోన్ పోలీసులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జడ్జిముందు ప్రవేశపెట్టనున్నారు. 

భద్రతా కారణాల దృష్ట్యా నిందితుడు శ్రీనివాసరావును సెంట్రల్ జైల్ లోనే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జడ్జిముందు ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే పలుమార్లు రిమాండ్ పొడిగించిన విశాఖపట్నం మూడో మెట్రోపాలిటన్ కోర్టు కేసును ఎన్ఐఏకు అప్పగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చెయ్యడంతో రిమాండ్ పై ఉత్కంఠ కొనసాగుతోంది.  
 
మరోవైపు హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన ఎన్ఐే విశాఖపట్నం మూడో మెట్రోపాలిటన్ కోర్టులో నిందితుడి కస్టడీ కోరుతూ పిటీషన్ దాఖలు చేయనున్నారు.  నిందితుడు శ్రీనివాసరావును అదుపులోకి తీసుకుని విచారించనున్నట్లు తెలుస్తోంది. అయితే నిందితుడిని ఎన్ఐఏ హెడ్ క్వార్టర్ బేగంపేట తీసుకు వెళ్తారా లేక విజయవాడలోని బ్రాంచ్ కార్యాలయంలో విచారిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.  

ఈ వార్తలు కూడా చదవండి
జగన్ పై దాడి కేసు: హైకోర్టు ఆదేశాలతో వెంటనే కదిలిన హోంశాఖ

హైకోర్టు ఆదేశం: జగన్ మీద దాడి కేసులో కీలక మలుపు

చంద్రబాబు భయమే నిజమైంది: మొదటికొచ్చిన జగన్ ఆస్తుల కేసు

click me!