జగన్ పై దాడి: 24 పేజీల లేఖపై ఆరా, లాక్కున్నారని శ్రీనివాస రావు

By pratap reddyFirst Published Jan 16, 2019, 12:04 PM IST
Highlights

శ్రీనివాస రావును బుధవారంనాడు కూడా ఎన్ఐఎ అధికారులు ప్రశ్నించనున్నారు. సికింద్రాబాదులోని గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత వారు శ్రీనివాస రావును ప్రశ్నిస్తారు. 

హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి కేసులో నిందితుడు శ్రీనివాస రావు రాసినట్లు చెబుతున్న 24 పేజీల లేఖపై ఎన్ఐఎ అధికారులు ఆరా తీస్తున్నారు. ఆ లేఖను విశాఖపట్నం పోలీసులు బలవంతంగా లాక్కున్నారని శ్రీనివాస రావు చెప్పినట్లు సమాచారం.

శ్రీనివాస రావును బుధవారంనాడు కూడా ఎన్ఐఎ అధికారులు ప్రశ్నించనున్నారు. సికింద్రాబాదులోని గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత వారు శ్రీనివాస రావును ప్రశ్నిస్తారు. మరో రెండు రోజుల పాటు శ్రీనివాస రావును ఎన్ఐఎ అధికారులు హైదరాబాదులోనే ప్రశ్నిస్తారు. న్యాయవాది సమక్షంలోనే ఈ విచారణ సాగుతుంది.

కాగా, శ్రీనివాస రావు చెప్పిన విషయాలను అన్నింటినీ ఎన్ఐఎ అధికారులు రికార్డు చేస్తున్నారు. జీరాక్స్ సెంటర్ లో లేఖ రాసిన మహిళను, విశాఖపట్నం విమానాశ్రయంలోని క్యాంటిన్ యజమానిని ప్రశ్నించేందుకు ఎన్ఐఎ అధికారులు సమాయత్తమవుతున్నారు. ఇందులో భాగంగా వారు హోటల్ యజమాని హర్షవర్ధన్ కు, వైసిపి కార్యకర్తలకు నోటీసులు జారీ చేశారు.

నోటీసులు అందుకున్నవారి వాంగ్మూలాలను కూడా ఎన్ఐఎ అధికారులు రికార్డు చేయనున్నారు. జగన్ పై దాడి కేసును కేంద్ర ప్రభుత్వం ఐఎన్ఎకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. గత నాలుగు రోజులుగా వారు శ్రీనివాస రావును విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

జగన్‌పై దాడి: జైల్లో 24 పేజీల లేఖ రాసుకొన్న శ్రీనివాసరావు

జగన్‌పై దాడి: గర్ల్‌ఫ్రెండ్స్‌ను ఇంప్రెస్ చేసేందుకే ఇలా...

జగన్‌పై దాడి: విశాఖకు శ్రీనివాసరావును తరలించనున్న ఎన్ఐఏ

click me!