కత్తిదాడి: జగన్‌కు ఎన్ఐఏ నోటీసులు

By narsimha lodeFirst Published Jan 16, 2019, 3:46 PM IST
Highlights

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో దాడి ఘటనకు సంబంధించి వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌కు ఎన్ఐఏ నోటీసులు ఇవ్వనుంది. ఈ విషయమై వీలైతే బుధవారం నాడే ఎన్ఐఏ ప్రశ్నించాలని భావిస్తున్నట్టు సమాచారం.

హైదరాబాద్: విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో దాడి ఘటనకు సంబంధించి వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌కు ఎన్ఐఏ నోటీసులు ఇవ్వనుంది. ఈ విషయమై వీలైతే బుధవారం నాడే ఎన్ఐఏ ప్రశ్నించాలని భావిస్తున్నట్టు సమాచారం.

గత ఏడాది అక్టోబర్ మాసంలో విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై శ్రీనివాసరావు అనే యువకుడు దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో జగన్ ప్రాణాపాయం నుండి తృటిలో తప్పించుకొన్నాడు.

ఈ కేసు విచారణను ఎన్ఐఏ కు అప్పగిస్తూ కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకొంది.ఈ మేరకు ఎన్ఐఏ అధికారులు కోర్టు అనుమతితో నిందితుడు శ్రీనివాసరావును విచారిస్తున్నారు.

శ్రీనివాసరావును హైద్రాబాద్‌లోని ఎన్ఐఏ ప్రధాన కార్యాలయంలో ఐదు రోజులుగా విచారిస్తున్నారు. మరో రెండు రోజుల పాటు ఈ విచారణ కొనసాగనుంది.  శ్రీనివాసరావు లాయర్ సలీం సమక్షంలో ఈ విచారణ సాగుతోంది. రోజుకో ఎన్ఐఏ అధికారి విచారణ చేస్తున్నారు. 

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన దాడి ఘటనకు సంబంధించి ఎన్ఐఏ జగన్‌కు నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ దాడికి సంబంధించి జగన్‌ను ఎన్ఐఏ అధికారులు వివరాలు తెలుసుకోవాలని భావిస్తున్నారు. 

వీలైతే ఇవాళే జగన్‌ను  ఎన్ఐఏ అధికారులు కలిసి ఈ విషయమై ప్రశ్నించే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది.రేపటి నుండి జగన్ హైద్రాబాద్‌లో అందుబాటులో ఉండరు ఈ కారణంగానే జగన్‌ను ఇవాళే కలవాలని  ఎన్ఐఏ  అధికారులు భావిస్తున్నారు.

ఇప్పటికే ఎయిర్‌పోర్ట్‌లో రెస్టారెంట్ నిర్వహిస్తున్న హర్షవర్ధన్‌కు కూడ నోటీసులను ఎన్ఐఏ అధికారులు జారీ చేశారు. శ్రీనివాసరావు కాల్‌డేటాను, హర్షవర్ధన్ కాల్ డేటాను కూడ ఎన్ఐఏ  విచారించనుంది. మరోవైపు శ్రీనివాసరావు సన్నిహితులను  కూడ విచారించే అవకాశం కూడ లేకపోలేదని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

జగన్ పై దాడి: 24 పేజీల లేఖపై ఆరా, లాక్కున్నారని శ్రీనివాస రావు

జగన్‌పై దాడి: జైల్లో 24 పేజీల లేఖ రాసుకొన్న శ్రీనివాసరావు

జగన్‌పై దాడి: గర్ల్‌ఫ్రెండ్స్‌ను ఇంప్రెస్ చేసేందుకే ఇలా...

జగన్‌పై దాడి: విశాఖకు శ్రీనివాసరావును తరలించనున్న ఎన్ఐఏ

 

click me!