జగన్‌ సర్కార్‌కు ఎన్జీటీ షాక్: పోతిరెడ్డిపాడు రాయలసీమ లిఫ్ట్ పై స్టే

By narsimha lodeFirst Published May 20, 2020, 11:58 AM IST
Highlights

పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యం పెంచే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఎన్జీటీ బుధవారం నాడు స్టే ఇచ్చింది.
 

న్యూఢిల్లీ:పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యం పెంచే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఎన్జీటీ బుధవారం నాడు స్టే ఇచ్చింది.రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రతిపాదిత ప్రాజెక్టుపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు చేయాలని ఎన్టీజీ ఆదేశించింది.

రెండు నెలల్లో నివేదిక అందించాలని ట్రిబ్యునల్ ఆదేశించారు. తదుపరి విచారణ వరకు ప్రతిపాదిత ప్రాజెక్టును ప్రారంభించవద్దని ఆదేశించింది ఎన్జీటీ.సుమారు 7 వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు నిర్మాణాన్ని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు ఈ నెల 5వ తేదీన జీవో జారీ చేసింది. 

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ (పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యం) పెంచేందుకు ఏపీ ప్రభుత్వం జారీ చేసిన 203 జీవో పై తెలంగాణకు చెందిన సామాజిక కార్యకర్త గవినోళ్ల శ్రీనివాస్  ఈ నెల 16వ తేదిన ఎన్జీటీని ఆశ్రయించాడు. 

మహబూబ్ నగర్ జిల్లా దామరగిద్ద మండలంలోని బాపన్ పల్లి గ్రామం శ్రీనివాస్ ది. పర్యావరణ అనుమతులు లేకుండానే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కు ఏపీ ప్రభుత్వం సన్నాహలు చేస్తోందని ఆయన ఆరోపించారు.

ఈ విషయమై సమగ్ర దర్యాప్తు చేయాలని ఆయన కోరారు. ఈ ప్రాజెక్టు నిర్మిస్తే తెలంగాణలోని కృష్ణా పరివాహక ప్రాంత ప్రజలు తమ జీవనోపాధిని కోల్పోయే అవకాశం ఉందని చెప్పారు

also read:జగన్ సర్కార్‌కు కృష్ణా బోర్డు షాక్: ముచ్చుమర్రి, హంద్రీనీవాకు నీళ్లు ఆపండి

పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యాన్ని పెంచేలా ఏపీ ప్రభుత్వం జారీ చేసిన 203 జీవోను తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ విషయమై ఇప్పటికే కృష్ణా రివర్ బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదుపై ఏపీని వివరణ కోరింది కృష్ణా బోర్డు.

మరో వైపు కృష్ణా నదిపై అనుమతులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం కూడ ప్రాజెక్టులు నిర్మిస్తున్న విషయమై రెండు రోజుల క్రితం ఏపీ ప్రభుత్వం ఫిర్యాదులు చేసింది.ఈ ఫిర్యాదులపై ఈ నెల 19వ తేదీన తెలంగాణ ప్రభుత్వాన్ని వివరణ కోరింది కృష్ణా రివర్ బోర్డు.
 


 

click me!