ఆంఫన్ ఎఫెక్ట్: కాకినాడ-ఉప్పాడ బీచ్ రోడ్డు ధ్వంసం, 8 ఇళ్లు ధ్వంసం

By narsimha lodeFirst Published May 20, 2020, 11:37 AM IST
Highlights

ఆంఫన్ తుఫాన్ ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లాలోని ఉప్పాడ తీరం వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఈ ప్రాంతంలో సముద్రం ముందుకు దూసుకువచ్చింది. ఈ ప్రాంతంలో రోడ్డు ధ్వంసమైంది. ఇటువైపుగా వాహనాలు రాకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకొంటున్నారు.


కాకినాడ: ఆంఫన్ తుఫాన్ ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లాలోని ఉప్పాడ తీరం వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఈ ప్రాంతంలో సముద్రం ముందుకు దూసుకువచ్చింది. ఈ ప్రాంతంలో రోడ్డు ధ్వంసమైంది. ఇటువైపుగా వాహనాలు రాకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకొంటున్నారు.

ఆంఫన్ తుఫాన్ ఇవాళ సాయంత్రానికి పశ్చిమ బెంగాల్- బంగ్లాదేశ్ మధ్య దిఘా, హతియా దీవుల వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

తుఫాన్ ప్రభావం ఉప్పాడ తీరంపై స్పష్టంగా కన్పిస్తోంది. బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. ఈ గాలులకు ఇళ్లు, చెట్లు నెలకొరిగాయి. సముద్ర తీర ప్రాంతం కోతకు గురైంది. సముద్రం ముందుకు చొచ్చుకు రావడంతో రోడ్డు దెబ్బతింది. 

also read:నేడు, రేపు ఆంపన్ తుఫాన్ ప్రభావం: వణుకుతున్న ఒడిశా, బెంగాల్ తీర ప్రాంతాలు

ఉప్పాడ, సూరాడపేట, జగ్గిరాజుపేటలో అలల తాకిడికి ఎనిమిది ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఉప్పాడ-కాకినాడ బీచ్ రోడ్డు ధ్వంసమైంది. ఈ ప్రాంతం నుండి వాహనాల రాకపోకలు సాగించకుండా ఉండేందుకు వీలుగా పోలీసులు వాహనాలను దారి మళ్లిస్తున్నారు. 

శ్రీకాకుళం జిల్లా తీరప్రాంత మండలాల్లో గాలుల ఉధృతి ఎక్కువగా ఉన్నట్టుగా కన్పిస్తోంది సోంపేట, బారువ తీరంలో పలు చోట్ల సముద్రం ముందుకు చొచ్చుకు వచ్చింది.భీమునిపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, వాడరేవు, కృష్ణపట్నం,కళింగపట్నం, గంగవరం,కాకినాడలలో మూడో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.

click me!