ఏపీ ప్రోజెక్టులపై ఎన్జీటీలో విచారణ.. పర్యావరణ చట్టాల తీవ్ర ఉల్లంఘన సిగ్గుచేటంటూ...

By AN TeluguFirst Published Aug 9, 2021, 3:55 PM IST
Highlights

పర్యావరణ చట్టాన్ని ఏపీలో తీవ్రంగా ఉల్లంఘించడం సిగ్గుచేటని, పోలవరం కాఫర్ డ్యాం వల్ల ముంపు జరుగుతుంటే.. ఏం చర్యలు తీసుకున్నారని అధికారులను ఎన్జీటీ నిలదీసింది. 
 

ఢిల్లీ : పోలవరం, పురుషోతపట్నం, పట్టిసీమ, ప్రాజెక్టులమీద ఎన్జీటీలో విచారణ జరిగింది. పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేసిన.. ఏ ఒక్క అధికారి మీద చర్యలు తీసుకోకపోవడంపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. 

పర్యావరణ చట్టాన్ని ఏపీలో తీవ్రంగా ఉల్లంఘించడం సిగ్గుచేటని, పోలవరం కాఫర్ డ్యాం వల్ల ముంపు జరుగుతుంటే.. ఏం చర్యలు తీసుకున్నారని అధికారులను ఎన్జీటీ నిలదీసింది. 

పోలవరం ముంపుపై ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నారని ఎన్జీటీ ప్రశ్నించింది. కేంద్ర పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి చర్యలు తీసుకోకపోవడం మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు ముగించాలన్న ఆతృత మాత్రమే సీపీసీబీ నివేదికలో 
కనిపించిందే తప్ప.. చట్టబద్దంగా నివేదిక ఇవ్వాలన్న చిత్తశుద్ధి కనిపించడం లేదని ఎన్జీటీ తప్పుబట్టింది. 

మూడేళ్ల నుంచి కాఫర్ డ్యాం వల్ల ముంపు జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించింది. తీర్పు మీద జస్టిస్ ఏకే గోయల్ నేతృత్వంలోని ధర్మాసనం సాయంత్రానికి వాయిదా వేసింది. 
 

click me!