నెక్ట్స్ సీఎంజూనియర్ ఎన్టీఆర్: కృష్ణా జిల్లాలో వినాయక విగ్రహల నిమజ్జనంలో జెండాలు

Published : Sep 21, 2021, 10:45 AM IST
నెక్ట్స్ సీఎంజూనియర్ ఎన్టీఆర్: కృష్ణా జిల్లాలో వినాయక విగ్రహల నిమజ్జనంలో జెండాలు

సారాంశం

నెక్ట్స్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ కృష్ణా జిల్లాలో మరోసారి జెండాలు కలకలం రేపుతున్నాయి. వినాయక నిమజ్జనం సందర్భంగా కృష్ణా జిల్లాలోని బంటుమిల్లి మండలం అర్ధమూరు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకొంది.


విజయవాడ: సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్(junior ntr)  నెక్ట్స్ సీఎం అంటూ జెండాలు పట్టుకొని వినాయక విగ్రహల నిమజ్జనం కార్యక్రమంలో జెండాలు పట్టుకోవడం మరోసారి కృష్ణా జిల్లా రాజకీయాల్లో కలకలం రేపుతోంది.కృష్ణా జిల్లాలోని  బంటుమిల్లి మండలం అర్ధమూరు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకొంది.సోమవారం నాడు వినాయక విగ్రహల నిమజ్జనం సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. 

 వినాయక విగ్రహల నిమజ్జనం ఊరేగింపు సందర్భంగా జూనియర్  ఎన్టీఆర్ అభిమానులు నెక్ట్స్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ జెండాలు పట్టుకొని ప్రదర్శన చేశారు. గతంలో కూడ కృష్ణా జిల్లాలో చంద్రబాబునాయుడు పాల్గొన్న కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ జెండాలు, ప్లైక్సీలు పట్టుకొని నినాదాలు చేసిన విషయం తెలిసిందే.

చంద్రబాబునాయుడు స్వంత నియోజకవర్గం కుప్పంలో కూడ జూనియర్ ఎన్టీఆర్ ను ప్రచారానికి ఆహ్వానించాలని పార్టీ కార్యకర్తలు కోరిన విషయం తెలిసిందే.ఏపీలో టీడీపీ ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు పార్టీని వీడి వెళ్లారు. బీజేపీ, వైసీపీల్లో చేరారు. మరికొందరు నేతలు టీడీపీలోనే ఉన్నా స్ధబ్దుగా ఉంటున్నారు. 

పార్టీ నాయకత్వం వైఖరి మారాలని గోరంట్ల బుచ్చయ్య చౌదవరి లాంటి నేతలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. 

 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్