నవవధువులు కాళ్ల పారాణి కూడా ఆరకముందే అత్తింటి ఆరళ్లకు బలవుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. పెళ్లైన పదహారు రోజులకే ఓ నవవధువు మృతి చెందింది. దీనిమీద సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అత్తింటి వేధింపులే ఆమె మరణానికి కారణమని ఆరోపిస్తున్నారు కుటుంబసభ్యులు.
ఓ వైపు మహిళలు ఎన్నో ఉన్నత పదవులు సాధిస్తూ.. ఎత్తైన కిలిమంజారో లాంటి పర్వతాలను అధిరోహిస్తూ రికార్డులు సాధిస్తుంటే.. మరోవైపు ఇంకొంత మంది మహిళలు కనీస భద్రత లేక.. వరకట్న వేధింపులకు నిండు జీవితాల్ని ఫణంగా పెడుతున్నారు.
నవవధువులు కాళ్ల పారాణి కూడా ఆరకముందే అత్తింటి ఆరళ్లకు బలవుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. పెళ్లైన పదహారు రోజులకే ఓ నవవధువు మృతి చెందింది. దీనిమీద సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అత్తింటి వేధింపులే ఆమె మరణానికి కారణమని ఆరోపిస్తున్నారు కుటుంబసభ్యులు.
మహిళల భద్రత కోసంప్రభుత్వాలు చేసిన చట్టాలు అబలలకు బలం చేకూర్చ లేకపోతున్నాయి. తాజాగా వర కట్న దాహానికి మరో నవ వధువు ప్రాణాలు కోల్పోయింది. భర్త అత్తమామల వేధింపులు భరించలేక Newly married bride కొత్త అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
ఈ ఘటన గుంటూరు రూరల్ మండలం పొత్తూరులో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. potturu గ్రామానికి చెందిన గోపాలకృష్ణారెడ్డితో స్వప్న శ్రీ కి 16 రోజుల క్రితం వివాహం జరిగింది.
marriage సందర్భంగా అన్ని లాంఛనాలతో ఘనంగా వివాహం జరిపించారు అయితే సోమవారం కొత్త పెళ్ళికూతురు స్వప్న శ్రీ Suspicious statusలో మృతి చెందింది. అంతేకాదు, ఆమె చనిపోయిన విషయాన్ని ఆలస్యంగా ఆమె కుటుంబ సభ్యులకు అందించారు. దీంతో అనుమానాలు మరింత బలపడ్డాయి.
తమ కూతురు చనిపోయిన విషయం తెలిసి అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు స్వప్నశ్రీ మృతి పట్ల అనుమానం వ్యక్తం చేశారు. అత్తమామలు extra dowry కోసం కొట్టి చంపారు అంటూ బంధువులు ఆరోపించారు. ఆ మేరకు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నల్లపాడు పోలీస్ స్టేషన్ లో స్వప్న శ్రీ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపి విచారణ చేపట్టారు.
విశాఖ ప్రేమోన్మాది ఘటన : చికిత్స పొందుతూ మృతి చెందిన హర్షవర్థన్...
ఇదిలా ఉండగా.. విశాఖపట్నంలోని సూర్యాబాగ్ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న యువకుడు హర్షవర్ధన్ మృతి చెందాడు. కేజీహెచ్ లో చికిత్స పొందుతూ ఈ ఉదయం చనిపోయాడు. ఈ నెల 13న యువతిపై పెట్రోల్ పోసిన హర్షవర్థన్ తానూ నిప్పంటించుకున్నాడు. యువతి పెళ్లికి నిరాకరించిందన్న కారణంగానే హర్షవర్ధన్ దాడికి పాల్పడ్డాడని వార్తలొచ్చాయి. పెట్రోల్ దాడి కారణంగా మంటల్లో తీవ్రంగా గాయపడిన యువతి కేజీహెచ్ లో చికిత్స పొందుతోంది.
Suryabagh ప్రాంతంలోని ఓ హోటల్లో శనివారం సాయంత్రం ఒక యువతీ, యువకుడు మంటల్లో కాలిపోతున్న దృశ్యాలు కలకలం రేపాయి. హోటల్ సిబ్బంది, స్థానికులు తలుపులు తెరిచి వారిని రక్షించి కేజీహెచ్ కు తరలించారు. తెలంగాణలోని వరంగల్ జిల్లా Bhupalapalliకి చెందిన పలకల హర్షవర్ధన్ (21), నగరంలో కరాస ప్రాంతానికి చెందిన ఓ యువతి (20, పంజాబ్‌లోని ఓ కళాశాలలో బీటెక్ చదువుతున్నారు. వీరిద్దరికి కాలేజ్‌లో పరిచయం ఉంది. అయితే Harshavardhanయువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నట్టుగా చెబుతున్నారు.