
కృష్ణాజిల్లా : పెళ్లయిన 4 నెలలకే ఆమెకు నూరేళ్లు నిండాయి. cellphone కారణంగా జరిగిన గొడవ newly married woman ప్రాణాలు బలితీసుకుంది. కలుపు మందు తాగి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలం భద్రిరాజుపాలెంలో జరిగిన ఈ ఘటన ఇరు కుటుంబాల్లో విషాదం నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రిరాజుపాలెం గ్రామానికి చెందిన వల్లూరు యోహాను, మరియమ్మ దంపతుల చిన్న కుమార్తె రత్నకుమారి (19)ను ఉంగుటూరు మండలం నందమూరు గ్రామానికి చెందిన పేటేటి సన్నీకి ఇచ్చి ఈ ఏడాది ఫిబ్రవరి 18న వివాహం చేశారు. సన్నీ వ్యవసాయ పనుల రీత్యా భద్రిరాజుపాలెంలోని అత్తగారి ఇంట్లోనే ఉంటున్నాడు.
ఈనెల 13న సెల్ఫోన్ కారణంగా రత్నకుమారితో చిన్న గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన రత్నకుమారి ఇంటి ఆవరణలో ఉన్న కలుపు మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందింది. రత్నకుమారి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పెళ్లై నాలుగు నెలలు కూడా నిండకముందే మృతిచెందడంతో ఇరు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. రత్నకుమారి ఇటీవల ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు కూడా రాసినట్లు తెలిసింది. మృతురాలి తండ్రి యోహాను ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అర్జున్ తెలియజేశారు.
కొత్తగూడెంలో ఇలాంటి ఘటనే జరిగింది, ఒక ప్రేమజంట పరారీకి సహకరించారంటూ.. ఆ ఊరి సర్పంచ్ ముగ్గురు యువకులను కొట్టాడు. వారిలో ఒక యువకుడు మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. bhadradri kothagudem జిల్లా అశ్వారావుపేట మండలం నారంవారిగూడెంలో జరిగిన ఈ సంఘటనపై మృతుడి Selfie video, అతడి కుటుంబీకుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి… ఆంధ్ర ప్రదేశ్ లోని ఏలూరు జిల్లా టి. నరసాపురం మండలం గండిగూడెం గ్రామానికి చెందిన దుర్గ భవాని శంకర్ (19) నారంవారిగూడెంలోని అమ్మమ్మ, తాతయ్యల వద్ద ఉంటూ డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తి చేశాడు.
వేరు వేరు సామాజిక వర్గాలకు చెందిన ఒక ప్రేమ జంట ఈ ఆదివారం గ్రామం నుంచి వెళ్ళిపోయింది. ఆ జంటకు ఐదుగురు యువకులు సహకరించారని గ్రామ సర్పంచి ముదిగొండ వెంకట ముత్యం భావించారు. వారిలో భవాని శంకర్, ముత్యాలరావు, వేముల నాగరాజులరె ఆదివారం పంచాయతీ కార్యాలయానికి పిలిపించి కొట్టారు. ప్రేమజంట ఆచూకీ చెప్పకుంటే చంపేస్తానని బెదిరించి సాయంత్రం వదిలేశారని చెబుతున్నారు. ఇంటికి వెళ్ళాక భవాని శంకర్ మనస్థాపంతో కలుపు మందు తాగడంతో అతడిని కొత్తగూడెం ఆస్పత్రికి తరలించారు. రెండు రోజుల తర్వాత పరిస్థితి విషమంగా ఉందని ఖమ్మం ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలో ప్రాణాలు విడిచాడు.
అందరి ఎదుట సర్పంచ్ కొట్టాడన్న బాధతోనే ఆత్మహత్యాయత్నం చేసినట్లు భవాని శంకర్ తీసుకున్న సెల్ఫీ వీడియో వైరల్ అయింది. అతడు మృతితో ఆగ్రహించిన కుటుంబీకులు, బంధువులు మృతదేహంతో అశ్వరావుపేట పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో శాంతించారు. కేసు నమోదు చేశామని, సర్పంచ్ ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని ఎస్సై అరుణ తెలిపారు.